AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs RR Eliminator Highlights, IPL 2026: హైదరాబాద్ ఓటమి.. క్వాలిఫైయర్ 2కి చేరిన రాజస్థాన్

Sunrisers Hyderabad vs Rajasthan Royals Eliminator Highlights: ఐపీఎల్ 2026 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోయింది. మే 29న న్యూ చండీగఢ్‌లో జరిగే క్వాలిఫయర్ 2లో రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 31న అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ ఆడుతుంది.

SRH vs RR Eliminator Highlights, IPL 2026: హైదరాబాద్ ఓటమి.. క్వాలిఫైయర్ 2కి చేరిన రాజస్థాన్
SRH vs RR Eliminator Live Score
Venkata Chari
|

Updated on: May 27, 2026 | 11:34 PM

Share

Sunrisers Hyderabad vs Rajasthan Royals Eliminator Highlights: ఐపీఎల్ 2026 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోయింది. మే 29న న్యూ చండీగఢ్‌లో జరిగే క్వాలిఫయర్ 2లో రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 31న అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ ఆడుతుంది.

బుధవారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 May 2026 11:28 PM (IST)

    రాజస్థాన్ ఘన విజయం..

    ఐపీఎల్ 2026 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోయింది. మే 29న న్యూ చండీగఢ్‌లో జరిగే క్వాలిఫయర్ 2లో రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 31న అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ ఆడుతుంది.

    బుధవారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది.

  • 27 May 2026 11:09 PM (IST)

    17 ఓవర్లకు..

    17 ఓవర్ల తర్వాత హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

  • 27 May 2026 10:57 PM (IST)

    8వ వికెట్ డౌన్..

    14.4 ఓవర్లకు హైదరాబాద్ టీం 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

  • 27 May 2026 10:27 PM (IST)

    9 ఓవర్లకు..

    9 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు సాధించింది. నితీష్ 34, అరోరా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 27 May 2026 10:17 PM (IST)

    క్లాసెన్ ఔట్..

    వరుస వికెట్లతో హైదరాబాద్ టీం పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. క్లాసెన్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో హైదరాబాద్ టీం 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

  • 27 May 2026 10:08 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    4.4 ఓవర్ల తర్వాత హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.

  • 27 May 2026 09:59 PM (IST)

    3 వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    3.3 ఓవర్లకు హైదరాబాద్ టీ0 3 వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 52 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

  • 27 May 2026 09:55 PM (IST)

    3 ఓవర్లకు..

    3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ఇషాన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 27 May 2026 09:48 PM (IST)

    2 ఓవర్లకు..

    2 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 1 వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. ఇషాన్ 17, హెడ్ 13 పరుగులతో నిలిచారు.

  • 27 May 2026 09:24 PM (IST)

    హైదరాబాద్ టార్గెట్ 244

    ఐపీఎల్ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

  • 27 May 2026 09:16 PM (IST)

    19 ఓవర్లకు

    19 ఓవర్లకు రాజస్థాన్ టీం 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.

  • 27 May 2026 09:03 PM (IST)

    శనక ఔట్..

    రాజస్థాన్ 16.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 29, ధ్రువ్ జురెల్ 50, రియాన్ పరాగ్ 26, దసున్ షనక 5 పరుగులు చేశారు.

  • 27 May 2026 08:57 PM (IST)

    పరాగ్ ఔట్..

    రియాన్ పరాగ్ 12 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం 15.2 ఓవర్లకు 207 పరుగులు చేసింది.

  • 27 May 2026 08:45 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    జురేల్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్థాన్ టీం 14 ఓవర్లలో 192 పరుగులు చేసింది.

  • 27 May 2026 08:35 PM (IST)

    160 దాటిన స్కోర్

    12 ఓవర్ల తర్వాత రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 29 పరుగులకు అవుటయ్యాడు.

  • 27 May 2026 08:22 PM (IST)

    ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు

    IPL నాకౌట్/ప్లేఆఫ్ గేమ్‌లో ఒక బ్యాటర్ బాదిన అత్యధిక 6లు :

    12 – వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, ముల్లన్‌పూర్, 2026

    10 – శుభమాన్ గిల్ (GT) vs MI, అహ్మదాబాద్, 2023

    9 – రజత్ పాటిదార్ (RCB) vs GT, ధర్మశాల, 2026

  • 27 May 2026 08:18 PM (IST)

    97 పరుగుల వద్ద వైభవ్ ఔట్..

    మరోసారి వైభవ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. కేవలం 3 పరుగుల దూరంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రాజస్థాన్ 8 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 125 పరుగులు చేసింది.

  • 27 May 2026 08:01 PM (IST)

    గిల్ 14 ఏళ్ల రికార్డ్ బ్రేక్..

    5 ఓవర్ల తర్వాత రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉన్నారు. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్ల విషయంలో క్రిస్ గేల్ 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. గేల్ 2012లో 59 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఈ సీజన్‌లో 61 సిక్సర్లు బాదాడు. సూర్యవంశీ తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

  • 27 May 2026 07:53 PM (IST)

    వైభవ్ హాఫ్ సెంచరీ..

    వైభవ్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 8 సిక్స్‌లతో వైభవ్ చెలరేగిపోయాడు.

  • 27 May 2026 07:36 PM (IST)

    SRH vs RR Score: వైభవ్ తొలి సిక్స్

    తొలి ఓవర్ ముగిసే సరికి రాజస్థాన్ 9 పరుగులు చేసింది. వైభవ్ 7, జైస్వాల్ 2 పరుగులతో నిలిచారు. వైభవ్ కమ్మిన్స్ బౌలింగ్‌లో సిక్స్ బాదేశాడు.

  • 27 May 2026 07:30 PM (IST)

    హైదరాబాద్ ప్లేయింగ్ 11

    హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, శివంగ్ కుమార్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.

  • 27 May 2026 07:29 PM (IST)

    రాజస్థాన్ ప్లేయింగ్ 11

    రాజస్థాన్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.

  • 27 May 2026 06:55 PM (IST)

    గేల్ రికార్డ్ వైభవ్ బ్రేక్ చేసే ఛాన్స్..

    ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టే అవకాశం రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఉంది. ఈ రికార్డు ప్రస్తుతం క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను 2012 సీజన్‌లో బెంగళూరు తరఫున 59 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ ఈ సీజన్‌లో 53 సిక్సర్లు బాదాడు.

  • 27 May 2026 06:40 PM (IST)

    ఇరుజట్ల రికార్డ్..

    రాజస్థాన్ కంటే హైదరాబాద్‌కు మెరుగైన హెడ్-టు-హెడ్ రికార్డు ఉంది. ఈ రెండు జట్లు 23 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, వాటిలో హైదరాబాద్ 14, రాజస్థాన్ 9 గెలిచాయి.

  • 27 May 2026 06:33 PM (IST)

    టాస్ గెలిచిన సన్ రైజర్స్

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్

  • 27 May 2026 06:20 PM (IST)

    ఓపెనర్లపైనే మ్యాచ్ ఫలితం..

    ఎలిమినేటర్ మ్యాచ్ ఫలితం పవర్‌ప్లేలో ఓపెనర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఉండగా, హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారు.

  • 27 May 2026 06:18 PM (IST)

    ఇరు జట్ల ప్లేయింగ్ 11

    రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), దసున్ షనాకా, డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, శుభమ్ దూబే, రవీంద్ర జడేజా/రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బృజేష్ శర్మ

    సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్/ప్రఫుల్ హింగే, ఈషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్

  • 27 May 2026 06:01 PM (IST)

    కీలక మ్యాచ్..

    సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.

Published On - May 27,2026 6:00 PM

Follow Us