IPL 14వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం చెపాక్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. 150 పరుగుల చిన్న టార్గెట్‌ను ఛేదించడంలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. కీలక సమయాల్లో రెచ్చిపోయిన బెంగళూరు బౌలర్లు తమ జట్టుకు అద్భుత విజయాన్నందించారు. 16వ ఓవర్ హైదరాబాద్ జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడంతో వార్నర్ జట్టు ఆందోళనకు గురైంది. ఇక్కడే మ్యాచ్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
కెప్టెన్ డేవిడ్ వార్నర్ (54/ 37 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్), మనీశ్ పాండే(38/ 39 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) చేసిన పోరాటం ఫలించలేదు. వీరిద్దరు ఔటైన తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా బెంగళూరు చేతిలోకి వెళ్లింది. షాబాజ్ అహ్మద్(3/7) సంచలన ప్రదర్శన చేసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. హర్షల్ పటేల్(2/25), మహ్మద్ సిరాజ్(2/25) గొప్పగా బౌలింగ్ చేశారు. పటేల్‌తోపాటు సిరాజ్ వేసిన బౌలింగ్ హైదరాబాద్ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు.
అంతకుముందు గ్లెన్ మాక్స్‌వెల్(59/ 41 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. మాక్స్‌వెల్ హాఫ్ సెంచరీకి తోడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (33/ 29 బంతుల్లో 4ఫోర్లు) కొద్దిగా మెరిపించడంతో బెంగళూరు 149 పరుగుల స్కోరును చేసింది. దేవదత్ పడిక్కల్(11), శాబాజ్ అహ్మద్(14), ఏబీ డివిలియర్స్(1), వాషింగ్టన్ సుందర్(8) తీవ్రంగా నిరాశపరిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు తీశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వృద్దిమాన్ సాహా, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, షాబాజ్ నదీమ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమ్సన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
ఐపీఎల్ 14వ సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ చివరి వరకు గెలుపు రెండు జట్ల అభిమానులతో ఆడుకుంది. దీంతో చివరి బంతి వరకు విజేత ఎవరో తేలలేదు. అయితే చివరి 5 ఓవర్లలో RCB బౌలర్లు మ్యాచ్‌ను మలుపుతిప్తేశారు. పది ఓవర్ల వరకు బెంగళూరుతో పోల్చితే ముందంజలో ఉన్న సన్‌రైజర్స్.. ఆ తర్వాత నెమ్మదిగా రూట్ మార్చుకుంది. ముఖ్యంగా 16వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు కఠినం చేసుకుంది. అంతేకాకుండా ఆ తర్వాత కూడా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆర్సీబీవైపు మళ్లింది. చివరి ఓవర్లో 16 పరుగుల కావల్సి ఉండగా.. 9 పరుగులు మాత్రమే చేసిన సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది
RCB 16 వ ఓవర్‌లో షాహాబాద్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో SRH యొక్క 3 వికెట్లు పడిపోయాయి. ఇది మ్యాచ్ను తిప్పికొట్టడానికి పని చేసింది. షాబాజ్ మొదట బైర్‌స్టోను.. తరువాత మనీష్ పాండేను.. తరువాత అబ్దుల్ సమద్‌ను ఔట్ చేశాడు. ఈ 3 వికెట్ల పడిన తరువాత మ్యాచ్ ఉత్తేజకరమైనదిగా మారడమే కాక.. మొత్తం టర్న్ అయ్యింది.
An absolute sensational over from Shahbaz Ahmed.
Picks up the wickets of Jonny Bairstow, Manish Pandey and Abdul Samad.
Live – https://t.co/apVryOzIWv #SRHvRCB #VIVOIPL pic.twitter.com/SE8K5VU0J2
— IndianPremierLeague (@IPL) April 14, 2021
ఎస్‌ఆర్‌హెచ్ 16 ఓవర్ల తర్వాత 116 పరుగులు చేసింది. SRH 2 వికెట్లు మాత్రమే కోల్పోయాడు. ఇప్పుడు గెలవడానికి చివరి 4 ఓవర్లలో 34 పరుగులు అవసరం. బెయిర్‌స్టో, మనీష్ పాండే క్రీజులో ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు SRH కోసం ఆటను పూర్తి చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అదే RCB 24 బంతుల్లో 34 పరుగులు చేయకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తుంది.
డేవిడ్ వార్నర్ వికెట్‌తో కైల్ జేమ్సన్ హైదరాబాద్‌కు రెండో దెబ్బ కొట్టాడు. అయినప్పటికీ, అతను తన ఓవర్ చివరి బంతికి బౌండరీ ఇవ్వడంతో సన్ రైజర్స్ స్కోరు 100 పరుగులు దాటకుండా ఆపలేకపోయాడు. బెయిర్‌స్టో తన చివరి బంతికి ఫోర్ కొట్టాడు. 14 ఓవర్ల తర్వాత హైదరాబాద్ 2 వికెట్లకు 103 పరుగులు చేసింది.
వార్నర్ దూకుడుకు బ్రేక్ పడింది. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(54: 37 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ తరువాత అవుటయ్యాడు. 14వ ఓవర్ వేసిన కైల్ జేమిసన్ విసిరిన ఓ స్లోబాల్‌ను లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడబోయిన వార్నర్.. అక్కడ డానియల్ క్రిస్టియన్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 13.2 ఓవర్లకు సన్‌రైజర్స్ 2 వికెట్లకు 96 పరుగులు చేసింది. మనీష్ పాండే(33/ 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులు), జానీ బెయిర్ స్టో(0) క్రీజులో ఉన్నారు.
చాహల్ వేసిన 11వ ఓవర్లో వార్నర్ రెండు బౌండరీలతో చెలరేగిపోయాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. క్రీజులో వార్నర్ 47, పాండే 31 ఉన్నారు.
వార్నర్ హాఫ్ సెంచరీతో దూసుకుపోతున్నాడు. తొలి క్రిస్టియన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీయడంతో వార్నర్ 50 మైలురాయిని చేరుకున్నాడు.
A brilliant 50-run stand comes up between @davidwarner31 & @im_manishpandey
Live – https://t.co/kDrqkM24yz #SRHvRCB #VIVOIPL pic.twitter.com/aFjuYCQGeb
— IndianPremierLeague (@IPL) April 14, 2021
తొలి మ్యాచ్‌లో మెరిసిన హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ 9 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
RCB-SRH మధ్యలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పట్టు బిగిస్తోంది. పది ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 7.70 రన్‌రేట్‌తో 77 పరుగులు చేసింది. క్రీజులో రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(38/ 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే(30:27 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులు) క్రీజులో ఉన్నారు. ఇంకా 7.30 రన్‌రేట్‌తో 10 ఓవర్లలో సన్‌రైజర్స్ 73 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. ఈ సమయానికి ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి కేవలం 63 పరుగులు మాత్రమే చేసింది.
11వ ఓవర్లో వార్నర్ మరో బౌండరీ కొట్టాడు. దీంతో కెప్టెన్ 47(28) అర్ధశతకానికి చేరవయ్యాడు
తొలి బంతికే బౌండరీ కొట్టిన వార్నర్.. యూజీ వేసిన 11వ ఓవర్‌లోనూ తొలి బంతిని రివర్స్ స్వీప్ ద్వారా బౌండరీకి పంపించాడు.
హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సమయానికి వార్నర్‌సేన వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ 32(19), మనీష్ పాండే 29(26) ఉన్నారు. ఆ జట్టు విజయానికి ఇంకా 66 బంతుల్లో 80 పరుగులు అవసరం.
జేమీసన్ వేసిన ఈ ఓవర్లో రెండో బంతిని మనీశ్ పాండే సిక్సర్ కొట్టగా.. ఆ తర్వాత వార్నర్(17) ఓ సూపర్ ఫోర్ కొట్టాడు.
జేమీసన్ వేసిన ఈ ఓవర్లో రెండో బంతిని మనీశ్ పాండే(8) సిక్సర్ కొట్టాడు.
వాషింగ్టన్ సుందర్ తన మొదటి ఓవర్లో 6 పరుగులు ఇచ్చాడు. ఇది SRH యొక్క ఇన్నింగ్ యొక్క 5 వ ఓవర్. ఈ ఓవర్ తరువాత SRH 1 వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. వార్నర్, మనీష్ పాండే జోడి క్రీజులో ఉంది.
ఎస్‌ఆర్‌హెచ్ 1 వికెట్ నష్టంతో 4 ఓవర్ల తర్వాత 32 పరుగులు చేసింది. నాలుగో ఓవర్ నుండి 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో వార్నర్ 2 సిక్సర్లు కొట్టాడు.
సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో సాహా(1) మ్యక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌లో రెండో, మూడో ఓవర్‌లో సహ వికెట్ తీయడం ద్వారా మొహమ్మద్ సిరాజ్ ఆర్‌సిబికి తొలి విజయాన్ని అందించాడు. సిరాజ్ బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకోవచ్చు. అతను 10 బంతుల తర్వాత మొదటి పరుగు ఇచ్చాడు. సిరాజ్ తన మొదటి 2 ఓవర్లలో కేవలం 2 పరుగులు చేసి 1 వికెట్ తీసుకున్నాడు. దీనితో ఆర్‌సిబి స్కోరు 3 ఓవర్ల తర్వాత 1 వికెట్‌కు 15 పరుగులు.
జేమీసన్ వేసిన 2వ ఓవర్లో వార్నర్(7) ఓ ఫోర్ బాదాడు. మరో ఐదు పరుగులొచ్చాయి. సాహా(1) క్రీజులో ఉన్నాడు.
RCB తరఫున మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. మొదటి 5 బంతులను కట్టుదిట్టంగా వేశాడు. చివరి బంతికి ఎక్స్ ట్రాల రూపంలో నాలుగు పరుగులొచ్చాయి. సాహా, వార్నర్ క్రీజులో ఉన్నారు.
RCB 20 ఓవర్ల తర్వాత 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. గ్లెన్ మాక్స్వెల్ ఒక్కడే అంతో ఇంతో చెప్పుకోదగ్గ స్కోరును చేయగలిగాడు. మాక్స్వెల్ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. 2016 తర్వాత ఐపీఎల్‌లో మాక్స్వెల్‌కు ఇదే మొదటి అర్ధ సెంచరీ.
హోల్డర్ వేసిన 20 ఓవర్‌లో మొదటి బంతికి జేమీసన్(12) మనీశ్ పాండేకు దొరికిపోయాడు.
ఐపీఎల్ 2021లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో RCB కనీసం 150 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ సిజన్‌తో 150 కంటే తక్కువ స్కోరు చేసిన తొలి జట్టుగా రికార్డును కూడా క్రియేట్ చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక పోయింది.
An even balance between bowling and fielding ensures we are on top of things in the first innings ⚖️
? – 150 runs#SRHvRCB #OrangeOrNothing #OrangeArmy #IPL2021 pic.twitter.com/27kyyeLyK1
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2021
భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో జేమీసన్ రెండు ఫోర్లు కొట్టాడు.మ్యాక్స్ వెల్(40) ఓ ఫోర్ బాదాడు. మొత్తం 14 పరుగులొచ్చాయి.
Kyle’s putting those long levers to full use!
Yet another classy shot down the ground for 4⃣#PlayBold #WeAreChallengers #IPL2021 #SRHvRCB #DareToDream pic.twitter.com/aziD8cqDTm
— Royal Challengers Bangalore (@RCBTweets) April 14, 2021
భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో జేమీసన్(9) రెండు ఫోర్లు కొట్టాడు.మ్యాక్స్ వెల్(40) ఓ ఫోర్ బాదాడు. మొత్తం 14 పరుగులొచ్చాయి.
టి నటరాజన్ వేసిన 16.4 బంతికి బెంగళూరు మరో వికెట్ కోల్పోయింది. టి నటరాజన్ వేసిన ఈ ఓవర్‌లో దూరంగా వెళ్తున్న బంతిని క్రిస్టియన్ కొట్టేందుకు ప్రయత్నించి సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రమం తప్పకుండా వికెట్లు పడేస్తోంది.
16 ఓవర్లకు బెంగళూరు రషీద్‌ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో కట్టుదిట్టమైన బంతులేశాడు. ఐదో బంతికి వాషింగ్టన్ సుందర్(8) మనీశ్ పాండేకు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాక్స్ వెల్(33), డానియల్ క్రిస్టియన్ క్రీజులో ఉన్నారు.
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతికి వాషింగ్టన్ సుందర్(7) ఫోర్ బాదాడు. మ్యాక్స్‌వెల్(31) పరుగులతో ఉన్నారు.
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగో బంతికి ఏబీ డివిలియర్స్(1) వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాక్స్ వెల్(1), మ్యాక్స్‌వెల్(30) పరుగులతో ఉన్నారు.
One picture. Many emotions… ? pic.twitter.com/zhCnl5KzSV
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2021
హోల్డర్ వేసిన 12 ఓవర్‌లో కేవలం ఒకే పరుగు వచ్చింది. వికెట్ కూడా రావడం విశేషం.
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ మూడో ఎదురుదెబ్బ తగిలింది. హోల్డర్ వేసిన 12 ఓవర్‌లో మొదటి బాల్‌ను భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన విరాట్ బౌండరీలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దెబ్బ ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 33 పరుగులు చేసిన తరువాత హోల్డర్ వేసిన బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆర్‌సిబి ఇన్నింగ్స్‌లో ఇది 13 వ ఓవర్.
RCB ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల ఆట ముగిసింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ జాగ్రత్తగా ఆడుతోంది. మొదటి 10 ఓవర్లలో కొంత ఆట నెమ్మదిగా సాగింది. RCB జట్టు 63 పరుగులు మాత్రమే చేసింది. రెండు వికెట్లు కూడా కోల్పోయింది. కేవలం 5 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్ 10 వ ఓవర్ బౌలింగ్ చేశాడు. దేవ్‌దత్ పడిక్కల్(11: 13 బంతుల్లో.. 2 ఫోర్లు), షాహబాజ్ అహ్మద్(14: 10 బంతుల్లో.. ఒక సిక్స్) అవుట్ కాగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(28: 22 బంతుల్లో.. 4 ఫోర్లు), మ్యాక్స్‌వెల్(9:16 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
రషీద్ ఖాన్ బౌలింగ్ మొదలు పెట్టాడు. రెండో బంతిని మ్యాక్స్ వెల్(5) బౌండరీకి పంపాడు. విరాట్ (21) పరుగులతో ఉన్నాడు.
RCB స్కోరు 5 ఓవర్ల తర్వాత 1 వికెట్‌కు 36 పరుగులు . ఈ ఓవర్ నుండి మొత్తం 10 పరుగులు వచ్చాయి. SRH నుంచి షాబాజ్ నదీమ్ 5 వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతికి RCB బ్యాట్స్‌మన్ షాబాద్ అహ్మద్ గొప్ప సిక్సర్ కొట్టాడు.
It’s Shahbaz vs Shahbaz.
There’s only one winner in this contest, and he plays for RCB ?
He has smoked that for a 6️⃣#PlayBold #WeAreChallengers #IPL2021 #SRHvRCB #DareToDream pic.twitter.com/qsUTUpxxHr
— Royal Challengers Bangalore (@RCBTweets) April 14, 2021
ఐపీఎల్ 2021లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఈ సీజన్‌లో తొలి సారి బరిలోకి దిగిన దేవ్‌దత్ పడిక్కల్(11: 13 బంతుల్లో.. 2 /4) భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో ఔటయ్యాడు. భువీ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా పుల్ చేయబోయిన పడిక్కల్.. అక్కడ షహబాజ్ నదీమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. నదీమ్ అద్భుతంగా లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కాగా.. 3 ఓవర్లకు ఆర్సీబీ ఒక వికెట్‌కు 20 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(6: 4 బంతుల్లో.. ఒక ఫోర్), షహబాజ్ అహ్మద్(0) క్రీజులో ఉన్నారు.
WICKET!@BhuviOfficial strikes! Padikkal departs for 11.
Live – https://t.co/apVryOzIWv #SRHvRCB #VIVOIPL pic.twitter.com/T7sMakXDcg
— IndianPremierLeague (@IPL) April 14, 2021
ఆర్సీబీ ఇన్నింగ్ మొదటి ఓవర్ నుండి 6 పరుగులు చేసింది. ఈ ఓవర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేశాడు. విరాట్ కోహ్లీ మొదటి స్ట్రైక్‌లో ఉన్నాడు, అతను రెండవ బంతికి ఒక ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో విరాట్ బ్యాట్ నుండి 5 పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఒక సింగిల్‌తో పడికల్ ఐపీఎల్ 2021 లో తన మొదటి పరుగును చేశాడు.
ఆర్సీబీ ఇన్నింగ్ మొదలు పెట్టింది. కెప్టెన్ కోహ్లీ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ దేవదత్ పాడిక్కల్ మైదానంలోకి దిగారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు జట్టుకు సాటిలేని ఆరంభం ఇస్తారని భావిస్తున్నారు. ఈ రోజు ఐపిఎల్‌లో తన 6000 పరుగుల పరుగులను పూర్తి చేయడానికి విరాట్ దృష్టి పెట్టనున్నాడు, ఈ కారణంగా అతను 89 పరుగుల దూరంలో ఉన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమ్సన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
Match 6. Royal Challengers Bangalore XI: V Kohli, D Padikkal, AB de Villiers, G Maxwell, D Christian, W Sundar, S Ahmed, K Jamieson, H Patel, M Siraj, Y Chahal https://t.co/apVryOi84X #SRHvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 14, 2021
సన్‌రైజర్స్ హైదరాబాద్: వృద్దిమాన్ సాహా, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, షాబాజ్ నదీమ్
Match 6. Sunrisers Hyderabad XI: D Warner, W Saha, M Pandey, J Bairstow, V Shankar, J Holder, A Samad, R Khan, B Kumar, S Nadeem, T Natarajan https://t.co/apVryOi84X #SRHvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 14, 2021
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ తమ జట్టులో 2 మార్పులు చేసింది. అదే సమయంలో బెంగళూరు 1 మార్పు చేసింది.
Match 6. Sunrisers Hyderabad win the toss and elect to field https://t.co/apVryOi84X #SRHvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 14, 2021
ఈ రోజు ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం కోసం చూస్తుంది. వాస్తవానికి, చెన్నైలో ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ రోజు వరకు గెలవలేకపోయింది. అది ఇక్కడ 4 మ్యాచ్‌లు ఆడి అన్ని ఓడిపోయింది. ఇప్పుడు వార్నర్‌తో వీరోచిత విరాట్ ఛాలెంజర్లను ఎలా ఎదుర్కొంటున్నాడో చూడాలి..
Hello & good evening from Chennai for Match 6 of the #VIVOIPL
David Warner’s @SunRisers will be up against @RCBTweets, led by Virat Kohli.
Which side are you rooting for tonight? ??#SRHvRCB pic.twitter.com/LeCIOD0hVH
— IndianPremierLeague (@IPL) April 14, 2021
ఓటు వేసే ముందు న్యాయం ఎవరివైపు ఉందో ఆలోచించాలి. నాగార్జున సాగర్‌లో సంక్షేమ పథకాలు అందడంలేదా?. పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నాంః కేసీఆర్