
SRH Retention list for IPL 2026: ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు, రాబోయే IPL 2026 సీజన్ కోసం మినీ-వేలానికి సిద్ధమవుతోంది. మెగా-వేలం జరగకపోయినప్పటికీ, మినీ-వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ కోర్ టీమ్‌ను నిలుపుకొని, మిగిలిన లోటుపాట్లను సరిచేసుకోవడానికి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేస్తాయి.
SRH మేనేజ్‌మెంట్ తమ పటిష్టమైన కోర్ గ్రూప్‌ను అలాగే ఉంచుకోవాలని భావిస్తోంది. గత సీజన్‌లో ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్లు, పటిష్టమైన ఆల్‌రౌండర్‌లతోపాటు తమ కెప్టెన్‌ను నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని తమ కీలక ఆటగాళ్లను తప్పక నిలుపుకునే అవకాశం ఉంది. ఈ లిస్టులో ఎవరుంటారో ఓసారి చూద్దాం.. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ వంటి కీలక ఆటగాళ్లను SRH తమ జట్టులో నిలుపుకునే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్ రౌండర్లను కూడా హైదరాబాద్ జట్టు నిలుపుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ క్లాసెన్‌తో విడిపోవచ్చనేది అతిపెద్ద పుకారు వినిపిస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ మినీ వేలానికి ముందు వీలైనంత ఎక్కువ డబ్బును తమ జేబులో చేర్చుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి, క్లాసెన్‌ను విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది. తద్వారా క్లాసెన్‌తో సమానమైన ప్రభావం చూపే తక్కువ ధర బ్యాటర్ కోసం వెతుకుతోంది. కాగా, మిగిలిన పర్స్ విలువను పెంచుకోవడం, కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం SRH ఆటగాళ్లను కొంతమందిని విడుదల చేసే అవకాశం ఉంది.
జట్టులో బలమైన దేశీయ స్పిన్నర్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, అనుభవం ఉన్న యువ భారత స్పిన్నర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అభిషేక్ శర్మ, క్లాసెన్ ప్రధాన బ్యాటింగ్‌ను చూసుకుంటారు. కానీ, వీరికి బ్యాకప్‌గా భారతీయ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కొందరిని విడుదల చేయడం ద్వారా SRH పర్స్ విలువ పెరుగుతుంది. దీంతో కీలక ఆటగాళ్ల కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంటుంది. SRH తమ పటిష్టమైన బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ మినీ-వేలాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటుంది.
IPL 2025 మెగా వేలంలో SRH పర్స్‌లో మొత్తం రూ. 120 కోట్ల నుంచి రూ. 119.80 కోట్లు ఖర్చు చేసింది.
IPL 2025లో పాల్గొన్న SRH జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, హర్ష్ దూబే, అథర్వ తైడ్, అభినవ్ మనోహర్, జమీన్‌దేవ్ అన్సద్ సింగ్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్ జేమీసన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..