ఐపీఎల్ (IPL 2022) ప్రారంభానికి ముందు, బంగ్లాదేశ్‌తో ODIలు, టెస్ట్ సిరీస్‌లలో ఆడనున్నందున దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టోర్నమెంట్‌లో ఆలస్యంగా చేరుతారని వార్తలు వచ్చాయి. ఈ వార్త ఐపీఎల్ ఫ్రాంచైజీల కష్టాలను మరింత పెంచింది. అయితే ప్రస్తుతం IPL ఫ్రాంచైజీలకు పెద్ద ఉపశమనం లభించింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా తన టెస్ట్ జట్టును(South Africa Test Squad) ప్రకటించింది. దీనిలో IPL 2022కి ఎంపికైన దక్షిణాఫ్రికా ఆటగాళ్లందరూ లేరు. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో (South Africa vs Bangladesh) రెండు మ్యాచ్‌ల హోమ్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టెస్ట్ జట్టును ప్రకటించింది.
కగిసో రబడ, లుంగీ ఎన్గిడి, మార్కో జెన్‌సన్ వంటి ఫాస్ట్ బౌలర్లు లేకుండా టెస్ట్ జట్టును ప్రకటించింది. ఈ టెస్ట్ సిరీస్ కంటే IPLకి ప్రాధాన్యతనిచ్చిన ఐడెన్ మార్క్‌రామ్, రాసి వాన్ డెర్ డుస్సెన్ వంటి బ్యాట్స్‌మెన్ లేకుండానే జట్టును ప్రకటించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఖయా జోండో తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. జట్టులో ఫాస్ట్ బౌలర్ డారిన్ డుపావిల్లోన్ రూపంలో కొత్త ముఖం కూడా ఉంది.
సౌతాఫ్రికా బోర్డుతో మాట్లాడిన బీసీసీఐ..
దక్షిణాఫ్రికా ఆటగాళ్ల సమస్యపై బీసీసీఐ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడింది. ఐపీఎల్‌లో ఆడడం వల్ల ఆటగాళ్లు దేశద్రోహులుగా మారరని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ గురువారం అన్నారు. IPL 2022లో మరిన్ని మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూరంగా ఉండరని ఈ ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఇంతలో, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెడ్డ వార్త వచ్చింది. వెన్ను, తుంటి నొప్పి కారణంగా అన్రిక్ నోర్కియా ఎంపికకు అందుబాటులో లేడు. అతను ఐపీఎల్‌లో ఆడటం కూడా సందేహాస్పదంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమయ్యాడని తెలిసిందే.
దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా (వైస్ కెప్టెన్), డారిన్ డుపావిల్లోన్, సరెల్ ఇర్వి, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, డువాన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, ర్యాన్ రికెల్టన్, లూథో సిప్మల, గ్లెంటన్ స్టౌర్మన్, కైల్ వెర్నెన్, (కీపర్), లిజాడ్ విలియమ్స్, ఖయా జోండో.
ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు..
ఐపీఎల్‌లో మొత్తం 11 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇందులో ఆరుగురు టెస్ట్ ప్లేయర్లు, ముగ్గురు వన్డే ప్లేయర్లు ఉన్నారు. కగిసో రబాడ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడు. లుంగీ ఎన్‌గిడి ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. మార్కో యాన్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడు. ఐడెన్ మార్క్రామ్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రాసిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. డ్వేన్ ప్రిటోరియస్ చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. గుజరాత్ లయన్స్ జట్టులో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అదే సమయంలో, క్వింటన్ డి కాక్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు.
Also Read: Team India: ‘షమీకి ఇదే చివరి ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే, అక్కడ రాణించాల్సిందే.. లేదంటే’
IPL 2022: స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ ఖాన్ నిషేధం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే..