Umran Malik: అలా ఉంటేనే సుదీర్ఘకాలం పాటు ఆడతాడు.. ఉమ్రాన్‌ మాలిక్‌పై ప్రశంసలు కురిపించిన సౌరభ్‌ గంగూలీ..

|

May 26, 2022 | 8:16 AM

భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్న పేస్ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌(Umran Malik)పై బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Gangul) ప్రశంసల వర్షం కురిపించాడు...

Umran Malik: అలా ఉంటేనే సుదీర్ఘకాలం పాటు ఆడతాడు.. ఉమ్రాన్‌ మాలిక్‌పై ప్రశంసలు కురిపించిన సౌరభ్‌ గంగూలీ..
Umran Malik
Follow us on

భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్న పేస్ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌(Umran Malik)పై బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Gangul) ప్రశంసల వర్షం కురిపించాడు. ఉమ్రాన్‌ మాలిక్ ఫిట్‌గా ఉంటే సుదీర్ఘకాలంపాటు టీమ్‌ఇండియాకు ఆడతాడని పేర్కొన్నాడు. ‘ఉమ్రాన్‌ మాలిక్ భవిష్యత్‌ అతడి చేతుల్లోనే ఉంది. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి ఇదే వేగంతో బౌలింగ్‌ చేస్తే కచ్చితంగా సుదీర్ఘకాలంపాటు టీమ్‌ఇండియాకు ఆడతాడనే నమ్మకం నాకుంది’ అని గంగూలీ వివరించాడు. మరికొన్ని రోజుల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ ఆదివారం జట్టుని ప్రకటించింది. దీంట్లో ఉమ్రాన్‌ మాలికకు స్థానం లభించింది.

భారత టీ20 లీగ్‌లో అదరగొడుతున్న మరికొంతమంది ఎమర్జింగ్‌ ప్లేయర్స్‌ని కూడా గంగూలీ ప్రశంసించాడు. ‘ఈ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. తిలక్ వర్మ, రాహుల్‌ త్రిపాఠి , రాహుల్‌ తెవాతియా రాణిస్తున్నారు. ఉమ్రాన్‌ మాలిక్‌, మెహ్‌సిన్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్‌ వంటి ఎందరో ఎమర్జింగ్‌ ఫాస్ట్‌బౌలర్లను మనం చూశాం. భారత టీ20 లీగ్‌ అనేది ప్రతిభను బహిర్గతం చేసే వేదిక’ అని గంగూలీ అన్నాడు. జూన్‌ 9 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

ఇవి కూడా చదవండి