Shumban Gill- Sara Tendulkar: శుభ్‌మన్‌- సారా బ్రేకప్‌ చెప్పుకున్నారా? ఆసక్తికర చర్చకు దారి తీసిన గిల్‌ పోస్ట్‌

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌ (Sara Tendulkar), టీమిండియా యంగ్‌ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ (Shumban Gill) డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు లైకులు కొట్టడం,

Shumban Gill- Sara Tendulkar: శుభ్‌మన్‌- సారా బ్రేకప్‌ చెప్పుకున్నారా? ఆసక్తికర చర్చకు దారి తీసిన గిల్‌ పోస్ట్‌
Shumban Gill Sara Tendulka

Updated on: Aug 27, 2022 | 6:18 AM

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌ (Sara Tendulkar), టీమిండియా యంగ్‌ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ (Shumban Gill) డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు లైకులు కొట్టడం, ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేసుకోవడం ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చింది. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ అటు సారా కానీ, గిల్ కానీ స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అందుకు కారణం గిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు కారణమేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

 

వివరాల్లోకి వెళితే ఇటీవలే జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ కెరీర్లో మొదటి సెంచరీ సాధించాడు గిల్‌. దీంతో పాటు వరుసగా రెండో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెల్చుకున్నాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతమైన ఆటతీరుతో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఈక్రమంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ తన కెరీర్‌పై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. అందుకే సారాతో బ్రేకప్‌ చేసుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా గిల్ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘లాయల్ టు మై ఫ్యూచర్. నాట్ మై పాస్ట్’ అంటూ ఓ కొటేషన్‌ పెట్టాడు. గతంలో జరిగినపోయిన దానికి తాను బాధ్యుడి కానంటూ గిల్ షేర్‌ చేసిన పోస్టు సారాను ఉద్దేశించి చేసిందేనంటున్నారు నెటిజన్స్‌. మరి ఇందులో ఎంత నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us