మావాళ్లు వేస్ట్.. అలా జరిగితేనే తప్ప, టీమిండియాను పాకిస్తాన్ ఎప్పటికీ ఓడించలేదు..!

Shoaib Akhtar Comemnts on India vs Pakistan Cricket: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత్‌తో ఆడే విషయంలో పాకిస్తాన్‌కు కీలక సలహాలు ఇచ్చారు. ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్‌లో భారత్‌ను ఎదుర్కొనేందుకు తాను కోచ్‌గా మారితే, ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చి, 150 స్ట్రైక్ రేట్‌తో ఆడమని చెబుతానని అన్నాడు. బాబర్ ఆజాం అద్భుత వరం అని, భయపడకుండా ఆడితేనే గెలుపు అవకాశాలుంటాయని అక్తర్ హెచ్చరించాడు.

మావాళ్లు వేస్ట్.. అలా జరిగితేనే తప్ప, టీమిండియాను పాకిస్తాన్ ఎప్పటికీ ఓడించలేదు..!
Shoaib Akhtar Comments On India Vs Pakistan Cricket

Updated on: Sep 29, 2026 | 11:37 AM

Shoaib Akhtar Comemnts on India vs Pakistan Cricket: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, ఉత్కంఠ, ఎమోషన్స్, యుద్ధ వాతావరణం వంటివి నెలకొనేవి. ఒకప్పుడు నువ్వా నేనా అనే స్థాయిలో సాగిన ఈ పోరులో, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ క్రికెట్ పతనం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి భిన్నంగా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా 2022 టీ20 ప్రపంచ కప్ నుండి భారత్, పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచ కప్ వంటి టోర్నీలలో భారత జట్టు పాకిస్తాన్ పై సునాయాస విజయాలు సాధిస్తోందని ఈ చర్చలో హైలైట్ చేయబడింది. భారత జట్టు వరుసగా ఐసీసీ టైటిల్స్ గెలిచి ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సోయబ్ అక్తర్ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “భారత జట్టును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ నన్ను హెడ్ కోచ్‌గా మార్చండి. బాబర్ ఆజాంను నాకివ్వండి. అతను ఒక్కడితోనే భారత జట్టును ఓడిస్తాను” అని అక్తర్ ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్‌కు బాబర్ ఆజాం అద్భుతమైన వరం అని ఆయన అభివర్ణించారు. తాను హెడ్ కోచ్‌గా మారితే బాబర్ ఆజాంను ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు నుంచి తప్పించనని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినది: టాస్ కూడా పడకుండానే ముగిసిన మ్యాచ్.. నేరుగా సెమీస్‌లోకి భారత్

ఇవి కూడా చదవండి

అక్తర్ తన ప్రణాళికను వివరిస్తూ, “నేను కోచ్‌గా ఉంటే భారత్‌తో ఆడేటప్పుడు బాబర్ ఆజాంతో పాటు టీమ్‌లోని ఆటగాళ్లందరికీ ఒకటే చెబుతా. భారత్‌తో మ్యాచ్ ఆడేటప్పుడు స్ట్రైక్ రేట్ 150కి తగ్గకుండా ఆడమని చెబుతా” అని అన్నారు. ముఖ్యంగా ఆటగాళ్లకు మైదానంలో పూర్తి స్వేచ్ఛనిస్తానని, అప్పుడే భారత్‌పై విజయం సాధించే అవకాశాలుంటాయని ఆయన నొక్కిచెప్పారు. సంప్రదాయ క్రికెట్ తో కాకుండా, దూకుడైన ఆటతీరుతోనే భారత్‌ను ఎదుర్కోవచ్చని అక్తర్ అభిప్రాయపడ్డారు.

ఎక్కువమంది చదివినది: నా టార్గెట్ ఫిక్స్.. అందుకోసం అడ్డొచ్చినోళ్లను తొక్కి పడేసుడే.. విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాబోయే ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్‌లో ఒకవేళ టీమిండియాతో పాకిస్తాన్ తలపడాల్సి వస్తే, తాను ఇచ్చే సలహా ఇదేనని అక్తర్ అన్నారు. “భారత్‌ను ధైర్యంగా ఎదుర్కోండి. మంచి స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్ ఆడండి. అప్పుడు పాకిస్తాన్‌కు గెలిచే అవకాశాలుంటాయి” అని సోయబ్ అక్తర్ పిలుపునిచ్చారు. ఏ మాత్రం భయపడినా సరే, టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ జట్టును అక్తర్ హెచ్చరించారు. తనకి పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా అవకాశం ఇస్తే, జట్టు తలరాతనే మారుస్తానని, పాకిస్తాన్ క్రికెట్‌ను మళ్లీ ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని సోయబ్ అక్తర్ పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us