రిటైర్మెంట్ ఇచ్చాడు.. ఇక పని అయిపోయిందని అనుకున్నారంతా.. కట్ చేస్తే.. ఊచకోత

|

Dec 19, 2024 | 12:17 PM

Shikhar Dhawan: శిఖర్ దావన్.. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుండి రిటైర్ అయిపోయాడు.. ఇక తన పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ.. కట్ చేస్తే..భారీ సెంచరీతో విధ్వంసం స్పష్టించాడు. బిగ్ క్రికెట్ లీగ్‌లో నార్తర్న్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా శిఖర్ ధావన్  కొనసాగుతున్నాడు. అయితే తాజాగా యూపీ బ్రిడ్జ్ స్టార్స్‌పై ధావన్ సెంచరీ చేశాడు.

రిటైర్మెంట్ ఇచ్చాడు.. ఇక పని అయిపోయిందని అనుకున్నారంతా.. కట్ చేస్తే.. ఊచకోత
Shikhar Dhawan
Follow us on

శిఖర్ ధావన్.. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుండి రిటైర్ అయిపోయాడు కాదా.. ఇక అతని పని అయిపోయింది లే అని అందరూ అనుకున్నారు.. కట్ చేస్తే.. బ్యాట్‌తో విధ్వంసం స్పష్టించాడు. బిగ్ క్రికెట్ లీగ్‌లో నార్తర్న్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా శిఖర్ ధావన్  ఉన్నాడు. ఇటీవల యూపీ బ్రిడ్జ్ స్టార్స్‌పై ధావన్ సెంచరీ చేశాడు. 49 బంతుల్లో సెంచరీ సాధించిన ధావన్ కేవలం 63 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. ధావన్ తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 14 ఫోర్లు బాదాడు. అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌ షెన్వారీతో కలిసి ధావన్‌ తొలి వికెట్‌కు 207 పరుగులు జోడించడం విశేషం. షిన్వారీ తన ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు. అతను 46 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. అతను చివరి వరకు నాటౌట్‌గా నిలవడంతో నార్తర్న్ ఛార్జర్స్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 271 పరుగుల భారీ స్కోరు చేసింది.

శిఖర్ ధావన్, షిన్వారీల ధాటికి నార్తర్న్ ఛార్జర్స్ జట్టు 52 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 271 పరుగుల భారీ స్కోరుకు ప్రత్యర్థి జట్టు 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. హామిల్టన్ మసకద్జా 72 పరుగులు చేయగా, చిరాగ్ గాంధీ 62 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినా అది కుదరలేదు.

బిగ్ క్రికెట్ లీగ్‌లో శిఖర్ ధావన్ పరుగుల వరద కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్ నిలిచాడు. ధావన్ 4 మ్యాచ్‌ల్లో 301 పరుగులు చేశాడు. నేపాల్ క్రికెట్ లీగ్‌లో కూడా చాలానే పరుగులు చేశాడు. ధావన్ రిటైర్మెంట్ తర్వాత ప్రతిచోటా లీగ్‌లు ఆడుతున్నాడు. డబ్బు సంపాదించడమే కాకుండా  తన అనుభవాన్ని కూడా యువ ఆటగాళ్లతో పంచుకుంటున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి