IND vs PAK: నేను పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడను.. తేల్చి చెప్పేసిన భారత క్రికెటర్‌! కారణం ఏంటంటే..?

పాకిస్థాన్ తో వరల్డ్ లీగ్స్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్ నిరాకరించాడు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం దేశభక్తికి నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మే 11 న టోర్నీ నిర్వాహకులకు ఈ విషయం ముందే తెలియజేశాడు.

IND vs PAK: నేను పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడను.. తేల్చి చెప్పేసిన భారత క్రికెటర్‌! కారణం ఏంటంటే..?
Team India

Updated on: Jul 20, 2025 | 7:14 AM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్నో ఏళ్లుగా జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు ఐసీసీ ఈవెంట్స్‌ లేకపోవడంతో భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌కు సంబంధించి పెద్దగా చర్చ జరగలేదు. ఆసియా కప్‌ 2025లో ఈ రెండు జట్లు పోటీపై ఇంకా క్లారిటీ లేదు. ఈ లోపే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీ మొదలైంది. ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన రిటైర్డ్‌ ఆటగాళ్లు ఆడుతున్నారు. భారత మాజీ క్రికెటర్ల టీమ్‌కు కూడా ఇందులో పాల్గొంటోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం (జూలై 20) పాకిస్థాన్‌ జట్టుతో భారత జట్టు తలపడనుంది.

అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత మాజీ క్రికెటర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు మీకు దేశభక్తి ఉందా? పహల్గామ్‌ ఉగ్రదాడి నిందితులు ఇంకా పట్టుబడనేలేదు, మీరు అప్పుడే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధం అయ్యారా? అంటూ భారత మాజీ క్రికెటర్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే డబ్ల్యూసీఎల్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఆడటం లేదని భారత మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ సంచలన పోస్ట్‌ చేశారు. నాకు దేశం కంటే ఏదీ ఎక్కువ కాదంటూ ఒక ట్వీట్‌ చేశాడు. అయితే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి కాబట్టి ధావన్‌ వాటికి భయపడి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడా? అని అనుకుంటే పొరపాటే.

పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆడను అని ఈ టోర్నీ ఆరంభానికి ముందే, టోర్నీలో పాల్గొనాలనే ఒప్పందం కుదిరినప్పుడే ధావన్‌ టోర్నీ నిర్వాహకులకు ఈ విషయం చెప్పాడు. మే 11న డబ్ల్యూసీఎస్‌ టోర్నీ నిర్వాహకులకు తాను పాకిస్థాన్‌తో ఏ మ్యాచ్‌ కూడా ఆడనని ఒక అధికారిక మెయిల్‌ను పంపించాడు. అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ట్వీట్‌ చేస్తూ.. దేశం కోసం అప్పుడు తీసుకున్న నిర్ణయంపై ఇంకా నిలబడే ఉన్నాను. నాకు దేశం కంటే ఏదీ ఎక్కువ కాదంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో ధావన్‌పై కొంతమంది నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి