ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం బెంగళూరు (Bangalore) లో ముగిసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగి ఈ ప్రక్రియ క్రికెట్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఈక్రమంలో అన్ని ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్లకే ప్రాధాన్యమిచ్చాయి. కోట్లు కుమ్మరించి వారిని సొంతం చేసుకున్నాయి. అదే సమయంలో సురైష్ రైనా (Suresh Raina), ఇయాన్ మోర్గాన్ (Morgan) లాంటి ఆటగాళ్లను ఎవరూ పట్టించుకోలేదు. కాగా ఐపీఎల్- 2022 మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో 15 సీజన్ ట్రోఫీ గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు, వ్యూహాలను రచించడంలో ఆయా జట్లు, ఫ్రాంఛైజీలు నిమగ్నమయ్యాయి. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2022 వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకుంది. కెప్టెన్ సంజూ శామ్సన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లను రాజస్థాన్ ముందే రిటైన్ చేసుకోగా.. వేలంలో స్టార్ ఆటగాళ్లను సొంతం తీసుకుంది. ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్ నైల్, రాసి వాన్ డెర్ డుసెన్ లాంటి స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది ఎంచుకుంది. మొత్తంగా చూసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ గతంలో కంటే చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈసారి కప్‌ను చేజిక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
వినూత్నంగా వెల్‌కమ్..
కాగా జట్టులో కొత్తగా చేరిన ఆటగాళ్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ వినూత్నంగా స్వాగతం పలికింది. ఇందులో భాగంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘దీవాంగి’ పాటను మార్ఫింగ్ చేసింది. ఇందులోషారుఖ్ ఖాన్ పాత్రలో కెప్టెన్ సంజూ శామ్సన్ తన జట్టు సభ్యులకు సాదర స్వాగతం పలికాడు. సల్మాన్, సైఫ్, సంజయ్, గోవిందా, రణవీర్, రితేష్, అర్బాజ్ స్థానాల్లో యుజ్వేంద్ర చాహల్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్ తదితర ఆటగాళ్లు కనిపించారు. చివరకు కోచ్ సంగక్కర సీనియర్ హీరో ధర్మేంద్ర క్యారెక్టర్ తో ఎంట్రీ ఇస్తాడు. ఇలా బాలీవుడ్ హీరోల ముఖాల మార్ఫింగ్‌తో సాగిన క్రికెటర్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి..
Wait for Sanga’s entry ?#RoyalsFamily | #IPL2022 | @yuzi_chahal | @JimmyNeesh | @SHetmyer | @KumarSanga2 | @ashwinravi99 | @IamSanjuSamson pic.twitter.com/PGgSJkmk7R
— Rajasthan Royals (@rajasthanroyals) February 15, 2022
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వైరస్ బారి నుంచి మరింత రక్షణ
Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?