తప్పు చేశాన్రా బుడ్డోడా.. మరోసారి ఛాన్స్ వస్తే ఫెవికాల్‌లా పట్టేసుకుంటా..!

Sanjiv Goenka Comments on Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వేలంలో లైట్ తీసుకుని తప్పు చేశానంటూ లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బుడ్డోడి ట్యాలెంట్ చూస్తే, ఆ రోజు మేం చేసింది ఘోర తప్పిదమంటూ చెప్పుకొచ్చారు.

తప్పు చేశాన్రా బుడ్డోడా.. మరోసారి ఛాన్స్ వస్తే ఫెవికాల్‌లా పట్టేసుకుంటా..!
Sanjiv Goenka Comments On Vaibhav Sooryavanshi

Updated on: Sep 13, 2026 | 6:39 PM

Sanjiv Goenka Comments on Vaibhav Sooryavanshi: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో అందరి ఫోకస్ టీమిండియా యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పై నిలిచింది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) బుడ్డోడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) వేలంలో వైభవ్‌ను దక్కించుకోలేకపోవడంపై తన పశ్చాత్తాపాన్ని వెల్లడిస్తూ, అతడిలోని ప్రత్యేక ప్రతిభను కొనియాడారు.

శుభాంకర్ మిశ్రా నిర్వహించిన అన్‌ప్లగ్డ్ పాడ్‌కాస్ట్‌లో వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ, వైభవ్ సూర్యవంశీని తరానికి ఒక్కసారి మాత్రమే కనిపించే అరుదైన ప్రతిభావంతుడిగా అభివర్ణించారు. ఐపీఎల్ (IPL) వేలంలో ఈ యువ బ్యాటర్‌ను తమ జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రతి ఫ్రాంచైజీ ఓనర్స్ కచ్చితంగా విచారం వ్యక్తం చేస్తారని ఆయన అన్నారు. లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వైభవ్‌ను వదులుకోదని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినది: Video: ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. అంపైర్లు అడ్డుగా వచ్చినా మైదానంలోనే పొట్టుపొట్టుగా.. !

ఇవి కూడా చదవండి

గతంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (Rising Pune Supergiant) జెర్సీ ధరించిన వైభవ్ తొలి ఫోటోలను గుర్తుచేసుకున్న గోయెంకా, నేడు ప్రపంచ క్రికెట్‌లో అతడు సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని తెలిపారు.

ఇతర యువ క్రికెటర్లతో పోలిస్తే వైభవ్‌లో ఉన్న తేడా అతడి అపారమైన ఆత్మవిశ్వాసమేనని గోయెంకా పేర్కొన్నారు. సాధారణంగా చాలామంది ఆటగాళ్లలో నైపుణ్యంతో పాటు మంచి షాట్లు ఆడే సామర్థ్యం సహజంగానే ఉంటుందని, అయితే క్రీజులో దిగినప్పుడు కనిపించే ధైర్యమే వైభవ్‌ను ప్రత్యేకంగా నిలుపుతుందని వివరించారు.

ఇదే సమయంలో ఆటగాళ్లకు అతివిశ్వాసం చేటు చేస్తుందని, అది పతనానికి దారితీసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. వైభవ్ తన సహజమైన దూకుడును నియంత్రించుకుంటూ, సరైన క్రికెటింగ్ షాట్లతో మ్యాచ్‌ మ్యాచ్‌కూ తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటున్నాడని విశ్లేషించారు.

ఎక్కువమంది చదివినది: Video: వామ్మో.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం.. 44 బంతుల్లోనే టార్గెట్‌ ఫినిష్..!

భారత క్రికెట్ జట్టు (Team India) తరపున బరిలోకి దిగుతున్న ఈ బీహార్ యువ ఓపెనర్, ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా అఫ్గానిస్థాన్ (Afghanistan) తో జరిగే తొలి టీ20 పోరులో పాల్గొననున్నాడు. అనంతరం ఆసియా క్రీడలు (Asian Games) 2026 పోటీల్లోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us