India vs Sri Lanka, Women’s Asia Cup Highlights Live: ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాదే విక్టరీ..
INDW vs SL-W , Women's Asia Cup Highlights Live Score Updates in Telugu: భారత్ ఎనిమిదోసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.

India vs Sri Lanka, Women’s Asia Cup Final Highlights: భారత్ ఎనిమిదోసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.
షఫాలీ వర్మ 68 పరుగులు, స్మృతి మంధాన 59 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి 129 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రీ చరణీ నాలుగు వికెట్లు తీయగా, దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది.
LIVE Cricket Score & Updates
-
భారత్ ఘనవిజయం..
భారత్ ఎనిమిదోసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.
-
INDW vs SLW Live: 4వ వికెట్ తీసిన తెలుగమ్మాయి..
తెలుగమ్మాయి శ్రీచరణి తన 4 ఓవర్ల కోటాలో భాగంగా 4 వికెట్లు తీసి సత్తా చాటింది.
-
-
7వ వికెట్ కోల్పోయిన లంక
లంక 16.4 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. దీంతో భారత్ 8వసారి ఆసియా కప్ ఎత్తేందుకు మరికొద్ది దూరంలో నిలిచింది.
-
INDW vs SLW Live: శ్రీచరణి ఖాతాలో 3వ వికెట్.. ఓటమిదిశగా లంక
శ్రీచరణి 3వికెట్లు పడగొట్టింది.
-
INDW vs SLW Live: 4వ వికెట్ కోల్పోయిన లంక.. తెలుగమ్మాయి ఖాతాలో తొలి వికెట్
ఫైనల్ ఒత్తిడిలో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. ఆఫ్ స్టంప్ దిశగా పడిన లెంగ్త్ బంతి పిచ్‌పై పడి లోపలికి టర్న్ అయింది. సమరవిక్రమ వెనక్కి వెళ్లి ఆఫ్ సైడ్ దిశగా పంచ్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెకు షాట్ ఆడేందుకు సమయం దొరకలేదు. దాంతో బంతిని నేరుగా శ్రీ చరణి వైపు పంచ్ చేయగా, ఆమె పైకి ఎగిరి వేళ్లు పైకి ఉంచి అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. ఈ వికెట్‌తో భారత జట్టు తమ 8వ ఆసియా కప్ టైటిల్‌కు మరో అడుగు చేరువైంది.
-
-
INDW vs SLW Live: 3వ వికెట్ కోల్పోయిన లంక
క్లీన్ బౌల్డ్! గ్రాండ్ ఫినాలేలో దీప్తి శర్మ అద్భుతంగా రాణిస్తోంది. ఆమె ఇప్పుడు ఆసియా కప్ 2026లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఓవర్ ది వికెట్ నుంచి లెగ్ స్టంప్ దిశగా, సరిగ్గా బ్లాక్ హోల్‌లో సీమ్ అప్ డెలివరీ వేసింది. గుణరత్నె స్టంప్స్‌కు బాగా అడ్డంగా కదిలింది. ఆమె స్వీప్ షాట్ మిస్ అవ్వడంతో బంతి నేరుగా వెళ్లి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక తీవ్ర కష్టాల్లో పడింది.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్..
డ్రింక్స్ బ్రేక్ వరకు శ్రీలంక జట్టు 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.
-
INDW vs SLW Live: 6 ఓవర్లకు
6 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక జట్టు 1 వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది.
-
INDW vs SLW Live: తొలి వికెట్ డౌన్..
తొలి ఓవర్ ముగిసే సరికి 6 పరుగులు చేసిన లంక, తొలి వికెట్ కోల్పోయింది. క్రాంతి గౌడ్ తొలి ఓవర్ లోనే బ్రేకిచ్చింది.
-
INDW vs SLW Live: షెషాలీ దూకుడు.. లంక టార్గెట్ 184
ఆఖరి ఓవర్లో 16 పరుగులు రావడంతో, మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో లంక ముందు 184 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
IND vs AFG: టీమిండియా టార్గెట్ 157
ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో జరుగుతోన్న తొలి టీ20లో భారత్ ముందు 157 పరుగులు టార్గెట్ నిలిచింది.
-
మంధాన కూడా ఔట్
పిచ్‌పై తీవ్రమైన గందరగోళం ఏర్పడటంతో మంధాన ఔట్ కాక తప్పలేదు. ఆటపట్టు ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా షార్ట్ డెలివరీ వేయగా, హర్మన్‌ప్రీత్ వెనక్కి వెళ్లి స్క్వేర్ ఆఫ్ ది వికెట్ దిశగా కట్ చేసింది. ఆమె వేగంగా పరుగు కోసం ముందుకు రాగా, మంధాన కాస్త సంకోచించింది. ఫలితంగా ఇద్దరు బ్యాటర్లూ పిచ్ మధ్యలోనే ఉండిపోయారు. కవర్ పాయింట్ వద్ద ఉన్న దిల్హారి వేగంగా బంతిని అందుకుని స్ట్రైకర్స్ ఎండ్ వైపు త్రో విసిరింది. అక్కడ వికెట్ కీపర్ నుత్యంగన బంతిని అందుకుని రెప్పపాటులో స్టంప్స్‌ను గిరాటేసింది. మంధాన తిరిగి క్రీజులోకి చేరుకునే అవకాశమే లేకపోయింది. అక్కడ అసలు పరుగే లేదు! 59 పరుగుల వద్ద ఆమె నిష్క్రమించడంతో, కుదురుకున్న ఇద్దరు ఓపెనర్లు వెంటనే పెవిలియన్ బాట పట్టారు.
-
అత్యధిక భాగస్వామ్యాలు:
మహిళల టీ20 ఆసియా కప్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాలు:
-
129 – స్మృతి మంధాన & షఫాలీ వర్మ (భారత్) vs శ్రీలంక, దుబాయ్, 2026 (1వ వికెట్)
-
128 – జెమీమా రోడ్రిగ్స్ & దీప్తి శర్మ (భారత్) vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సిల్హెట్, 2022 (4వ వికెట్)
-
122 – దయాళన్ హేమలత & షఫాలీ వర్మ (భారత్) vs నేపాల్, దంబుల్లా, 2024 (1వ వికెట్)
-
-
షెఫాలీ ఔట్
ఎట్టకేలకు లంక జట్టు భారత ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయగలిగింది. షఫాలీ ముందుగానే క్రీజు వదిలి ముందుకు వచ్చింది. అది గమనించిన ప్రబోధ బంతి లెంగ్త్‌ను వెనక్కి లాగుతూ, ఆఫ్ స్టంప్ బయటగా విసిరింది. షఫాలీ సర్దుకుని ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా గాల్లోకి లేపేందుకు ప్రయత్నించినప్పటికీ, బంతికి తగినంత ఎత్తు లభించలేదు. దీంతో బంతి నేరుగా సర్కిల్ లోపల ఉన్న ఆటపట్టు చేతుల్లోకి వెళ్లడంతో ఆమె సులువైన క్యాచ్ అందుకుంది. దీంతో షఫాలీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది.
-
మంధాన హాఫ్ సెంచరీ
ఆసియా కప్ ఫైనల్‌లో స్మృతి మంధాన కేవలం 35 బంతుల్లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించింది. ఇంతటి కీలకమైన వేదికపై భారత ఓపెనర్ నుంచి వచ్చిన మరో క్లాసీ ఇన్నింగ్స్ ఇది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి మంధానకు ఇది 36వ అర్ధశతకం!
-
10 ఓవర్లకు స్కోర్..
10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 98 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 59, మంధాన 38 పరుగులు చేసింది.
-
ఆసియా కప్‌లో షఫాలీ వర్మ ఆల్‌టైమ్ రికార్డు!
మహిళల ఆసియా కప్ (Women’s Asia Cup) ఫైనల్ పోరులో భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఆసియా కప్‌లో షఫాలీ వర్మ ఆల్‌టైమ్ రికార్డు!
-
23 బంతుల్లోనే..
మహిళల ఆసియా కప్ (Women’s Asia Cup) ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు (Team India) ఓపెనర్లు రికార్డుల మోత మోగించారు. విధ్వంసకర బ్యాటర్ షఫాలీ వర్మ (Shafali Verma) కేవలం 24 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం బాది సత్తా చాటింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తో కలిసి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన భాగస్వామ్య మైలురాయిని అందుకుంది.
-
5 ఓవర్లకు స్కోర్..
5 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 55 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 37, మంధాన 18 పరుగులతో నిలిచారు.
-
దుబాయ్‌లో నఖ్వీకి నో ఎంట్రీ.. ఇదే తాజా అప్‌డేట్!
మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీ ప్రజెంటేషన్‌పై నెలకొన్న ఉత్కంఠకు తాజా అప్‌డేట్ వచ్చింది. ACC అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఫైనల్ మ్యాచ్ సమయంలో దుబాయ్‌లో అందుబాటులో లేరని సమాచారం. దీంతో భారత్ ఛాంపియన్‌గా నిలిస్తే హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ట్రోఫీని నఖ్వీ కాకుండా ACC ఉపాధ్యక్షుడు ఖలీద్ జరూనీ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది పురుషుల ఆసియా కప్‌లో చోటుచేసుకున్న ట్రోఫీ వివాదం నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తిని రేపుతోంది.
-
INDW vs SLW: హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ..
మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. బోర్డుపై మంచి స్కోరు ఉంచడం మాకు చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఫైనల్ మ్యాచ్ ముఖ్యమైనదే, ఒత్తిడి ఉంటుంది. కానీ మనం మంచి క్రికెట్ ఆడాలి. మా జట్టులో ఒక మార్పు ఉంది, ప్రతీకకు విశ్రాంతినిచ్చి కమలినిని ఆడిస్తున్నాం.
-
INDW vs SLW: టీమిండియా ప్లేయింగ్ 11
భారత మహిళల జట్టు (ప్లేయింగ్ ఎలెవన్): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), గుణలన్ కమలిని, దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందని శర్మ.
-
INDW vs SLW Toss Update: టాస్ గెలిచిన భారత్..
ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
-
IND vs AFG Toss Update: టాస్ గెలిచిన భారత్
టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, శ్రేయాస్ మాట్లాడుతూ.. వైభవ్ ఆడటం లేదంటూ షాకిచ్చాడు. దీంతో ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు.
-
తప్పు చేశాన్రా బుడ్డోడా..
వైభవ్ సూర్యవంశీని వేలంలో లైట్ తీసుకుని తప్పు చేశానంటూ లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. తప్పు చేశాన్రా బుడ్డోడా.. మరోసారి ఛాన్స్ వస్తే ఫెవికాల్‌లా పట్టేసుకుంటా..!
-
India vs Afghanistan: సూర్యవంశీ లేదా శాంసన్?
మరోవైపు నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు టీమిండియా పురుషుల టీం సిద్ధమైంది. అయితే, ఓపెనర్‌గా ఎవరోస్తారోనని అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ లేదా సంజు సామ్సన్ లలో ఎవరు ఓపెనింగ్ చేస్తారో చూడాలి.
-
స్పిన్నర్లపైనే ఆధారం..
ఈ మ్యాచ్ ప్రధానంగా స్పిన్నర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో భారత స్పిన్నర్లు 26 వికెట్లు తీయగా, శ్రీలంక స్పిన్నర్లు 25 వికెట్లు పడగొట్టారు.
-
టాస్ గెలిస్తే..
ఈ టోర్నమెంట్‌లో దుబాయ్‌లోని స్లో పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన 14 మ్యాచ్‌లలో తొమ్మిదింటిని మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుచుకుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
-
India vs Sri Lanka: తోపు ప్లేయర్లు వీళ్లే
ఈ ఆసియా కప్‌లో షఫాలీ నాలుగు మ్యాచ్‌లలో 169.69 స్ట్రైక్ రేట్‌తో 168 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన 168 పరుగులతో రెండో స్థానంలో నిలిచింది.
-
తోపు బౌలర్లు..
టీమిండియా ఆఫ్-స్పిన్నర్ దీప్తి శర్మ 4 మ్యాచ్‌లలో 3.52 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీసి, టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచింది. శ్రీ చరణి కూడా నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు పడగొట్టింది.
-
ఇరుజట్ల మధ్య గణాంకాలు..
ఇరు జట్ల మధ్య మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 25 మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక ఐదు మ్యాచ్‌లు గెలుచుకుంది, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
-
10సార్లు ఫైనల్ ఆడిన భారత్..
వన్డే ఫార్మాట్‌లో జరిగిన నాలుగు ఫైనల్స్‌లోనూ భారత్ విజయం సాధించింది. టీ20లలో భారత జట్టు 2012, 2016, 2022లలో గెలుపొందగా, 2018, 2024లలో రన్నరప్‌గా నిలిచింది.
-
Women’s Asia Cup Final Live: 10వ ఫైనల్ మ్యాచ్
ఆసియా కప్ ఫైనల్ జరగడం ఇది 10వ సారి. భారత్ ప్రతిసారీ ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు నాలుగు సార్లు వన్డే ఫైనల్‌లో, ఇప్పుడు ఆరోసారి టీ20 ఫైనల్‌లో ఆడనుంది.
-
India vs Sri Lanka Live: గతంలో షాకిచ్చిన లంక
గత ఆసియా కప్ ఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడగా, శ్రీలంక టైటిల్‌ను గెలుచుకుంది.
-
India vs Sri Lanka, Women’s Asia Cup Final Live: ఫైనల్ పోరు
మహిళల ఆసియా కప్ ఫైనల్ నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
Published On - Sep 13,2026 3:52 PM




