SA 20 : భయం అంటే తెలీదు.. పరుగుల దాహం తీరదు..కావ్య పాప కొత్త డేంజరస్ వెపన్ రెడీ

SA 20 : టీ20 క్రికెట్ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త స్టార్స్ ఉదయిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన 21 ఏళ్ల యువ ఆల్ రౌండర్ జేమ్స్ కోల్స్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరపున SA20లో అరంగేట్రం చేసిన జేమ్స్, తొలి మ్యాచ్‌లోనే బ్యాటుతోనూ బంతితోనూ సత్తా చాటాడు.

SA 20 : భయం అంటే తెలీదు.. పరుగుల దాహం తీరదు..కావ్య పాప కొత్త డేంజరస్ వెపన్ రెడీ
Kavya Maran

Updated on: Jan 15, 2026 | 11:34 AM

SA 20 : టీ20 క్రికెట్ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త స్టార్స్ ఉదయిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన 21 ఏళ్ల యువ ఆల్ రౌండర్ జేమ్స్ కోల్స్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరపున SA20లో అరంగేట్రం చేసిన జేమ్స్, తొలి మ్యాచ్‌లోనే బ్యాటుతోనూ బంతితోనూ సత్తా చాటాడు. జనవరి 14న జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ డబుల్ ధమాకా ప్రదర్శనతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌ను ఫుల్ ఖుషీ చేశాడు.

నిజానికి జేమ్స్ కోల్స్ అరంగేట్రం జనవరి 3నే జరగాల్సి ఉంది, కానీ ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో జనవరి 14న అతనికి అవకాశం దక్కింది. సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించింది. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ కోల్స్, టీమ్‌లోనే అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. కేవలం 34 బంతుల్లోనే 10 బౌండరీల సాయంతో 61 పరుగులు బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు.

బ్యాటింగ్‌లో మెరిసిన జేమ్స్, బౌలింగ్‌లోనూ తన మార్క్ చూపించాడు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో తిప్పలు పెట్టాడు. తన కోటా 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ఆల్ రౌండ్ షోకు గానూ జేమ్స్ కోల్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో కావ్య మారన్ జట్టులో మరో ధురంధర ఆటగాడు దొరికాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

జేమ్స్ కోల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజయం సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో అత్యధికంగా 24 పాయింట్లతో సన్‌రైజర్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగిస్తున్నట్లే, ఇటు సౌతాఫ్రికా లీగ్‌లోనూ ఈస్టర్న్ కేప్ జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.