RR vs KKR Highlights, IPL 2022: 7 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్‌

|

Apr 19, 2022 | 12:33 AM

Rajasthan Royals vs Kolkata Knight Riders Highlights in Telugu: ఐపీఎల్ 2022 లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీ ప్రారంభంలో అదరగొట్టిన ఆ జట్టు ఇప్పుడు హ్యాట్రిక్‌ పరాజయాలను ఎదుర్కొంది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ తో

RR vs KKR Highlights, IPL 2022: 7 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్‌
Ipl

Rajasthan Royals vs Kolkata Knight Riders Highlights in Telugu: ఐపీఎల్ 2022 లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీ ప్రారంభంలో అదరగొట్టిన ఆ జట్టు ఇప్పుడు హ్యాట్రిక్‌ పరాజయాలను ఎదుర్కొంది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌ (RR vs KKR)లో శ్రేయస్‌ సేన 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పింక్‌ ఆర్మీ స్పిన్నర్‌ యుజువేంద్రా చాహల్ హ్యాట్రిక్‌ తో పాటు ఐదు వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఈ సీజన్‌లో 217/5 పరుగుల భారీస్కోరు సాధించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (85), ఓపెనర్‌ ఫించ్‌ (58) రాణించడంతో ఛేదనలో చివరి వరకు పోరాడింది కోల్‌కతా. అయితే చాహల్‌ స్పిన్‌ మ్యాజిక్‌కు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటై 7 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. హ్యాట్రిక్‌ తో పాటు ఐదు వికెట్లతో రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యూజీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. కాగా ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి 7 మ్యాచ్‌లో ఇది నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆజట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ఇరు జట్ల ప్లేయర్స్ ( అంచనా)..

రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్  : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్,, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, రసిఖ్ సలామ్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Key Events

రెండు జట్లు ఓటమి చవి చూశాయి..

చివరి మ్యాచ్‌లో రెండు జట్లు వైఫల్యం చెందాయి. ఇటు రాజస్థాన్‌ గుజరాత్‌ చేతిలో, అటు కోల్‌కతా హైదరాబాద్‌ చేతిలో ఓడిపోయింది.

ఎవరెన్ని మ్యాచ్‌లు గెలిచారంటే..

రాజస్థాన్‌, కోల్‌కతా మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు జరగ్గా, అందులో కోల్‌కతా 13 విజయాలు సాధించగా, రాజస్థాన్ 11 విజయాలు సాధించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 18 Apr 2022 11:37 PM (IST)

    కోల్‌కతా 210 పరుగులకి ఆలౌట్‌

    కోల్‌కతా 210 పరుగులకి ఆలౌట్‌ అయింది. దీంతో రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. యజ్వేంద్ర చాహల్‌ వరుస వికెట్లతో కోల్‌కతాని కోలుకోని దెబ్బ తీశాడు. ఏకంగా 5 వికెట్లు సాధించాడు. మెక్ కాయ్ 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ద కృష్ణ చెరో వికెట్‌ సాధించారు. కోల్‌కతాలో శ్రేయాస్ అయ్యార్ 85, ఆరోన్‌ పించ్ 58 పరుగులు చేశారు. మితతా వారు ఎవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

  • 18 Apr 2022 11:34 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. షెల్డన్ జాక్సన్ 8 పరుగులకి ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. విజయానికి 4 బంతుల్లో 9 పరుగులు కావాలి.

  • 18 Apr 2022 11:25 PM (IST)

    200 పరుగులు దాటిన కోల్‌కతా

    కోల్‌కతా 200 పరుగులు దాటింది. 18 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. క్రీజులో ఉమేశ్ యాదవ్ 19 పరుగులు, జాక్సన్ 2 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి 12 బంతుల్లో 18 పరుగుల చేరువలో ఉంది.

  • 18 Apr 2022 11:19 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. పాట్‌ కమిన్స్‌న్ 0 పరుగులకి ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 20 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2022 11:17 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా ఏడో వికెట్‌ కోల్పోయింది. శివమ్‌ 0 పరుగులకి ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 20 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2022 11:15 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా ఆరో వికెట్‌ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 85 పరుగులకి ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 20 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉంది. చాహల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

  • 18 Apr 2022 11:10 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా ఐదో వికెట్‌ కోల్పోయింది. వెంకటేశ్‌ అయ్యార్ 6 పరుగులకి ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విజయానికి ఇంకా పరుగుల 40 దూరంలో ఉంది.

  • 18 Apr 2022 11:04 PM (IST)

    15 ఓవర్లకి కోల్‌కతా 167/4

    15 ఓవర్లకి కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్ 77 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 3 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 30 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2022 10:55 PM (IST)

    150 పరుగులు దాటిన కోల్‌కతా

    కోల్‌కతా 150 పరుగులు దాటింది. దీంతో 13.5 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్‌ అయ్యర్ 66 పరుగులు, వెంకటేశ్‌ అయ్యర్ 1 పరుగుతో ఆడుతున్నారు. విజయానికి 66 పరుగుల చేరువలో ఉంది.

  • 18 Apr 2022 10:53 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా నాలుగో వికెట్‌ కోల్పోయింది. రస్సెల్‌ 0 పరుగులకి ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో బోల్డ్‌ అయ్యాడు. దీంతో కేకేఆర్‌ 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగుల దూరంలో ఉంది.

  • 18 Apr 2022 10:48 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా మూడో వికెట్‌ కోల్పోయింది. నితీష్ రానా 11 బంతుల్లో 18 పరుగులు ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 70 పరుగుల దూరంలో ఉంది.

  • 18 Apr 2022 10:36 PM (IST)

    10 ఓవర్లకి కోల్‌కతా 118/2

    కోల్‌కతా 10 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 51 పరుగులు, నితిష్ రానా 1 పరుగుతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 98 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2022 10:35 PM (IST)

    శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ

    శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా 10.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 59 బంతుల్లో 101 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2022 10:30 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా రెండో వికెట్‌ కోల్పోయింది. అరోన్‌ పించ్ 28 బంతుల్లో 58 పరుగులు ఔటయ్యాడు. బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. విజయానికి ఇంకా111 పరుగుల దూరంలో ఉంది.

  • 18 Apr 2022 10:27 PM (IST)

    100 పరుగుల భాగస్వామ్యం

    శ్రేయాస్ అయ్యార్, అరోన్ ఫించ్‌ 52 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కోల్‌కతా 8.5 ఓవరల్లో ఒక వికెట్‌ నష్టానికి 106 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 112 పరుగుల దూరంలో నిలిచింది.

  • 18 Apr 2022 10:26 PM (IST)

    100 పరుగులు దాటిన కోల్‌కతా

    కోల్‌కతా 8.3 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్రీజులో అరోన్ పించ్ 57 పరుగులు, శ్రేయాస్‌ అయ్యర్ 40 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా114 పరుగుల దూరంలో నిలిచింది.

  • 18 Apr 2022 10:24 PM (IST)

    అరోన్‌ ఫించ్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ

    అరోన్‌ ఫించ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా 8.2 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 99 పరుగులు చేసింది. విజయానికి ఇంకా70 బంతుల్లో 119 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2022 10:08 PM (IST)

    50 పరుగులు దాటిన కోల్‌కతా

    కోల్‌కతా 6 ఓవర్లలో 50 పరుగులు దాటింది. శ్రేయాస్ అయ్యార్ 33 పరుగులు, అరోన్ ఫించ్‌23 పరుగులతో ఆడుతున్నారు.

  • 18 Apr 2022 10:06 PM (IST)

    కోల్‌కతా 5 ఓవర్లకి 43/1

    కోల్‌కతా 5 ఓవర్లకి ఒక వికెట్‌ కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యార్ 26 పరుగులు, అరోన్ ఫించ్‌17 పరుగులతో ఆడుతున్నారు.

  • 18 Apr 2022 09:26 PM (IST)

    కోల్‌కతా ముందు భారీ లక్ష్యం..

    రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుకు స్టేడియంలో పరుగుల వరద పారింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 217 పరుగులను సాధించింది. బట్లర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్‌ను భారీగా పెంచాడు. కోల్‌కతా విజయం సాధించాలంటే 218 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2022 09:08 PM (IST)

    బట్లర్‌ అవుట్‌..

    కేవలం 61 బంతుల్లోనే 103 పరుగులు సాధించిన రాజస్థాన్‌ స్కోరును పరుగులు పెట్టించిన బట్లర్‌ అవుట్ అయ్యాడు. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన బట్లర్‌ బౌండరీ వద్ద వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్థాన్‌ స్కోర్‌ 17 ఓవర్లు ముగిసే సమయానికి 189 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 18 Apr 2022 09:03 PM (IST)

    సెంచరీ పూర్తి..

    బట్లర్‌ దంచికొడుతున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ దారి పట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 59 బంతిల్లోనే బట్లర్‌ 100 పరుగులను దాటేశాడు.

  • 18 Apr 2022 08:54 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్‌..

    రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. 19 బంతుల్లో 38 పరుగులు సాధించిన సంజూ శాంసన్‌, రసెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి శివమ్‌ మావికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 18 Apr 2022 08:51 PM (IST)

    150 దాటిన రాజస్థాన్‌ స్కోర్..

    రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుతో స్టేడియంలో పరుగుల వర్షం పారుతోంది. బట్లర్‌కు తోడుగా నిలిచిన సంజు శాంసన్‌ జట్టు స్కోర్‌ను జట్టు వేగంగా పరిగెత్తిస్తున్నారు. రాజస్థాన్‌ 15 ఓవర్లు ముగిసే సమయానికి 163 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో శాంసన్‌ (38), బట్లర్‌ (90) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 18 Apr 2022 08:25 PM (IST)

    రాజస్థాన్‌ స్పీడ్‌కు బ్రేక్‌లు..

    రాజస్థాన్‌ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా చెలరేగుతోన్న రాజస్థాన్‌ జట్టుకు దేవదత్‌ పడిక్కల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్‌ బౌలింగ్‌లో దేవదత్‌ పడిక్కల్‌ బౌల్డ్‌ అయ్యాడు.

  • 18 Apr 2022 08:12 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి..

    బట్లర్‌ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసింది. దీంతో రాజస్థాన్‌ 7 ఓవర్లు ముగిసే సమయానికే 74 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌ (51), దేవదత్ పడిక్కల్ (17) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 18 Apr 2022 07:58 PM (IST)

    బట్లర్‌ దూకుడు..

    టాస్‌ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన రాజస్థాన్‌ జట్టుకు ఓపెనర్స్‌ మంచి ప్రారంభాన్ని అందించారు. బట్లర్‌ దూకుడుతో జట్టు స్కోర్‌ దూసుకుపోతోంది. బట్లర్‌ కేవలం 22 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 48 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 18 Apr 2022 07:10 PM (IST)

    ఇరు జట్ల ప్లేయర్స్..

    రాజస్థాన్‌ రాయల్స్‌..

    జాస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, కరుణ్ నాయక్, హెట్మెయర్, రియన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రషిద్ కృష్ణ, మెకాయ్, యుజ్వేంద్ర చాహల్.

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌..

    ఆరోన్ ఫించ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, షెల్డన్ జాక్సన్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, పాట్ కమిన్స్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

  • 18 Apr 2022 07:03 PM (IST)

    టాస్‌ గెలిచిన కోల్‌కతా..

    టాస్‌ గెలిచిన కోల్‌కతా మొదట బౌలింగ్‌ చేయడానికి మొగ్గు చూపింది. బౌర్న్‌ స్టేడియంలో బౌలింగ్‌కు అనుకూలించడం, డ్యూ ఇంపాక్ట్‌ ఉండనుండంతో కోల్‌కతా ఈ నిర్ణయం తీసుకున్నలు తెలుస్తోంది. మరి కోల్‌కతా తొలుత బౌలింగ్‌ చేయడం ఆ జట్టుకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

Follow us on