RCB vs LSG, IPL2024: మయాంక్ మాయాజాలం.. హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ మళ్లీ బోల్తా.. 28 రన్స్ తేడాతో లక్నో గెలుపు

|

Apr 03, 2024 | 12:01 AM

సొంత గడ్డపై ఆర్సీబీ మళ్లీ బోల్తా పడింది. మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు క్వింటన్ డి కాక్ (81) అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

RCB vs LSG, IPL2024: మయాంక్ మాయాజాలం.. హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ మళ్లీ బోల్తా.. 28 రన్స్ తేడాతో లక్నో గెలుపు
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants
Follow us on

సొంత గడ్డపై ఆర్సీబీ మళ్లీ బోల్తా పడింది. మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు క్వింటన్ డి కాక్ (81) అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు చతికిల పడింది. 153 పరుగులకు ఆలౌటై హోం గ్రౌండ్‌లో 28 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. మహిపాల్ లోమ్రోర్ అత్యధికంగా 33 పరుగులు చేయగా, రజత్ పాటిదార్ 29 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత, మరే ఇతర RCB ఆటగాడు ఇన్నింగ్స్ నుండి కోలుకోలేదు. గతంలో ఇదే మైదానంలో కేకేఆర్‌ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో RCBకి ఇది మూడవ ఓటమి మరియు లక్నోకు వరుసగా రెండవ విజయం. లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించిన మయాంక్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా అతను వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికవ్వడం విశేషం.

చిన్నస్వామి స్టేడియంలో 200లోపు స్కోరును ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాని సొంత గడ్డపై ఆర్సీబీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. డించింది. విరాట్ కోహ్లి 22 పరుగులు చేసి ఔట్ అయ్యి నిరాశపర్చాడు. విరాట్ అవుటైన తర్వాత రజత్ పాటిదార్ 29 పరుగులు, మహిపాల్ లోమ్రోర్ 33 పరుగులు చేశారు. వీరిద్దరూ తప్ప మరే ఇతర ఆటగాడు మైదానంలో పరుగులు సాధించలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో అందరి దృష్టి రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన లక్నో ఆటగాడు మయాంక్ యాదవ్‌పై పడింది. అందుకు తగ్గట్టే 4 ఓవర్ల తన స్పెల్‌లో 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఇవి కూడా చదవండి

మయాంక్ మాయాజాలం..

RCB ప్లేయింగ్ XI: 

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), యశ్ దయాల్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్.

LSG ప్లేయింగ్ XI :

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), KL రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడికల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..