RCB vs CSK Highlights, IPL 2021: మరోసారి ఓడిన కోహ్లీ సేన.. 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ ఘన విజయం

|

Sep 24, 2021 | 11:38 PM

Royal Challengers Bangalore vs Chennai Super Kings Highlights in Telugu:ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచులను పరిశీలిస్తే.. మూడు మ్యాచుల్లో సీఎస్‌కే టీం విజయం సాధించగా, రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీ టీం గెలిచింది.

RCB vs CSK Highlights, IPL 2021: మరోసారి ఓడిన కోహ్లీ సేన.. 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ ఘన విజయం
IPL 2021, RCB vs CSK

IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా 35 వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ టీంతో రాయల్స్‌ ఛాలెంజ్ బెంగళూరు టీం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో సీఎస్‌కే టీం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 6 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన 18.1 ఓవర్లలో టార్గెట్‌ను చేరుకుని విజయం సాధించింది. దీంతో సీఎస్‌కే టీం పాయింట్ల పట్టికలో 7 విజయాలతో 14 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. కోహ్లీ సేన మాత్రం మూడో స్థానంలోనే నిలిచింది.

ఐపీఎల్ 2021లో భాగంగా నేడు షార్జాలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ టీంల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో విరాట్ సేన బ్యాటింగ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో సీఎస్‌కే టీం ముందు 157 టార్గెట్‌ను ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(53 పరుగులు, 41 బంతులు, 6 ఫోర్లు, సిక్స్), దేవదత్ పడిక్కల్ (70 పరుగులు, 50 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. షార్జాలో మైదానం చిన్నగా ఉండడంతో బౌండరీల మోత మోగించారు. ఇద్దరూ కలిసి ఓ దశలో అర్థ సెంచరీ కోసం బౌండరీలలో పోటీ పడ్డారు. అలాగే 140 పైగా స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. 

ఐపీఎల్‌లో నేడు రెండు కీలక టీంలు తలపడనున్నాడు. ధోని ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం కోహ్లీ సారథిగా వ్యవహరిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచులను పరిశీలిస్తే.. మూడు మ్యాచుల్లో సీఎస్‌కే టీం విజయం సాధించగా, రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీ టీం గెలిచింది.

ముంబై టీంతో జరిగిన తొలి మ్యాచులో గెలిచి ధోని సేన ఎంతో ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరోవైపు రెండో దశలో ఆడిన తొలి మ్యాచులో కేకేఆర్‌పై ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది కోహ్లీ సేన. దీంతో ఈ మ్యాచులో ఎలా ఆడనున్నారో చూడాలి. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే చెన్నై టీం 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కోహ్లీ సేన 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 24 Sep 2021 11:14 PM (IST)

    చెన్నైదే విజయం

    157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీం.. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెన్‌ను పూర్తి చేసింది. దీంతో ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. దీంతో సీఎస్‌కే టీం పాయింట్ల పట్టికలో 7 విజయాలతో 14 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. కోహ్లీ సేన మాత్రం మూడో స్థానంలోనే నిలిచింది.

  • 24 Sep 2021 11:05 PM (IST)

    17 ఓవర్లకు 145/4

    17 ఓవర్లకు సీఎస్‌కే టీం నాలుగు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. రైనా 15, ధోని 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. సీఎస్‌కే టీం విజయానికి మరో 12 పరుగులు కావాల్సి ఉంది.

  • 24 Sep 2021 10:59 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన సీఎస్‌కే

    సీఎస్‌కే టీం 15.4 ఓవర్లో రాయుడు (32) రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 133 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 24 Sep 2021 10:48 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన సీఎస్‌కే

    సీఎస్‌కే టీం 13.6 ఓవర్లో అలీ (23) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లీ సైనికి క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 118 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 24 Sep 2021 10:42 PM (IST)

    13 ఓవర్లకు 112/2

    13 ఓవర్లకు సీఎస్‌కే టీం రెండు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. అలీ 21, అంబటి రాయుడు 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 10:27 PM (IST)

    2వ వికెట్ కోల్పోయిన సీఎస్‌కే

    సీఎస్‌కే టీం 9.1 ఓవర్లో డుప్లిసిస్ (31) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో నవదీప్ సైనికి క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 71 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 24 Sep 2021 10:22 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే

    సీఎస్‌కే టీం 8.2 ఓవర్లో రుతురాజ్ (38) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 71 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 24 Sep 2021 10:19 PM (IST)

    8 ఓవర్లకు 67/0

    8 ఓవర్లకు సీఎస్‌కే టీం వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. రుతురాజ్ 34, డుప్లిసిస్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 10:09 PM (IST)

    6 ఓవర్లకు 59/0

    6 ఓవర్లకు సీఎస్‌కే టీం వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేసింది. రుతురాజ్ 28, డుప్లిసిస్ 29 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 09:58 PM (IST)

    4 ఓవర్లకు 35/0

    4 ఓవర్లకు సీఎస్‌కే టీం వికెట్ కోల్పోకుండా 35 పరుగులు చేసింది. రుతురాజ్ 22, డుప్లిసిస్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 09:47 PM (IST)

    2 ఓవర్లకు 18/0

    2 ఓవర్లకు సీఎస్‌కే వికెట్ కోల్పోకుండా 18 పరుగులు చేసింది. రుతురాజ్ 7, డుప్లిసిస్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 09:42 PM (IST)

    మొదలైన సీఎస్‌కే బ్యాటింగ్

    157 పరుగుల లక్ష్యంతో సీఎస్‌కే బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లుగా రుతురాజ్, డుప్లిసిస్ బరిలోకి దిగారు.

  • 24 Sep 2021 09:24 PM (IST)

    చెన్నై టీం టార్గెట్ 157

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో సీఎస్‌కే టీం ముందు 157 టార్గెట్‌ను ఉంచింది.

  • 24 Sep 2021 09:20 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ

    ఆర్‌సీబీ టీం 19.2ఓవర్లో మాక్స్‌వెల్ (11) రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. బ్రావో బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 154 వద్ద పెవిలియన్ చేరాడు.

  • 24 Sep 2021 09:15 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ

    ఆర్‌సీబీ టీం 18.2ఓవర్లో టిమ్ డేవిడ్ (1) రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. చాహర్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 150 వద్ద పెవిలియన్ చేరాడు.

  • 24 Sep 2021 09:09 PM (IST)

    ఠాకూర్ దెబ్బకు వరుసగా రెండు వికెట్లు

    17 ఓవర్లో ఠాకూర్ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్లో ఆర్‌సీబీ టీం రెండు వికెట్లను కోల్పోయింది. డివిలియర్స్ 12, పడిక్కల్ 70 పరుగులు చేసి పెవలియన్ చేరారు.

  • 24 Sep 2021 08:59 PM (IST)

    16 ఓవర్లకు 131/0

    16 ఓవర్లకు ఆర్‌సీబీ ఒక వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. పడిక్కల్ 67, డివిలియర్స్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 08:47 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ

    ఆర్‌సీబీ టీం 13.2ఓవర్లో కోహ్లీ(53) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. డ్వేన్ బ్రావో వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా తరలించిన కోహ్లీ జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. దీంతో టీం స్కోర్ 111 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 24 Sep 2021 08:42 PM (IST)

    కోహ్లీ అర్థ సెంచరీ

    ఆర్‌సీబీ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. భారీ స్కోర్ దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోమ్లీ తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. కేవలం 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 24 Sep 2021 08:39 PM (IST)

    పడిక్కల్ అర్థ సెంచరీ

    ఆర్‌సీబీ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. భారీ స్కోర్ దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో పడిక్కల్ తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 24 Sep 2021 08:36 PM (IST)

    11 ఓవర్లకు 96/0

    11 ఓవర్లకు ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. పడిక్కల్ 48, విరాట్ కోహ్లీ 45 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 ఫోర్లు, 3 సిక్సులు బాదేశారు.

  • 24 Sep 2021 08:29 PM (IST)

    9 ఓవర్లకు 82/0

    9 ఓవర్లకు ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. పడిక్కల్ 38, విరాట్ కోహ్లీ 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. షార్జాలో బౌండరీల వర్షం కురిపిస్తూ భారీ స్కోర్ సాధించే దిశగా సాగుతున్నారు. ఇప్పటి వరకు 8 ఫోర్లు, 3 సిక్సులు బాదేశారు.

  • 24 Sep 2021 08:20 PM (IST)

    7 ఓవర్లకు 61/0

    7 ఓవర్లకు ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. పడిక్కల్ 26, విరాట్ కోహ్లీ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 08:19 PM (IST)

    టీ 20 క్రికెట్‌లో ప్రత్యర్థిపై విరాట్ కోహ్లీ చేసిన అత్యధిక పరుగులు

    చెన్నై సూపర్ కింగ్స్ – 939*
    ఢిల్లీ క్యాపిటల్స్ – 933
    కోల్‌కతా నైట్ రైడర్స్ – 735
    ముంబై ఇండియన్స్ – 728
    ఆస్ట్రేలియా – 718

  • 24 Sep 2021 08:14 PM (IST)

    6 ఓవర్లకు 55/0

    6 ఓవర్లకు ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. పడిక్కల్ 21, విరాట్ కోహ్లీ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 08:04 PM (IST)

    4 ఓవర్లకు 36/0

    4 ఓవర్లకు ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. పడిక్కల్ 17, విరాట్ కోహ్లీ 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Sep 2021 07:35 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ శైనీ, యుజ్వేంద్ర చాహల్
    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

  • 24 Sep 2021 07:32 PM (IST)

    టాస్ గెలిచిన సీఎస్‌కే

    టాస్ గెలిచిన ధోని ఊహించినట్లుగానే బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్‌సీబీ టీం బ్యాటింగ్ చేయనుంది.

  • 24 Sep 2021 07:17 PM (IST)

    మరో 15 నిమిషాలు ఆలస్యం

    షార్జాలో ఇసుక తుఫాన్ తగ్గని కారణంగా టాస్‌ను మరో 15 నిమిషాలు ఆలస్యం కానుంది.

  • 24 Sep 2021 07:05 PM (IST)

    ఆలస్యంగా టాస్

    షార్జాలో ఇసుక తుఫాన్ కారణంగా టాస్‌ను 10 నిమిషాలు ఆలస్యంగా వేయనున్నారు.

  • 24 Sep 2021 06:59 PM (IST)

    టాస్‌కి రంగం సిద్ధం

    దిగ్గజాల పోరుకు షార్జా మైదానం రెడీ అయింది. మ్యాచులో భాగంగా కీలకమైన టాస్‌కు రంగం సిద్ధమైంది. టాస్ గెలిస్తే ఈ పిచ్‌లో బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే షార్జా మైదానం చాలా చిన్నగా ఉండడంతో బౌండరీల మోత మోగనుంది.

  • 24 Sep 2021 06:56 PM (IST)

    RCB vs CSK: హెడ్ టూ హెడ్ రికార్డులు

    సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ధోనీ సేనదే పైచేయిగా ఉంది. సీఎస్‌కే ఇప్పటివరకు 17 మ్యాచుల్లో విజయం సాధించగా, ఆర్‌సీబీ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Follow us on