Rohit Sharma: ఆ ట్రోఫీలోకి రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడంటే?

Rohit Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ 2026-27లో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జట్టులో చేరే అవకాశం ఉంది. ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 155 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Rohit Sharma: ఆ ట్రోఫీలోకి రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడంటే?
Rohit Sharma (1)

Updated on: Nov 01, 2026 | 11:10 AM

Rohit Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి దేశవాళీ క్రికెట్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 2026-27 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు తెలియజేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ మ్యాచ్‌లు ఆడటం ద్వారా మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కొనసాగించడంతో పాటు బ్యాటింగ్ సాధనకు అవకాశం ఉంటుంది.

డిసెంబర్‌లో ముంబై జట్టులోకి

విజయ్ హజారే ట్రోఫీ 2026 డిసెంబర్ 14 నుంచి 2027 జనవరి 8 వరకు జరగనుంది. అయితే రోహిత్ టోర్నీ ప్రారంభం నుంచే అందుబాటులో ఉండే అవకాశం లేదు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ డిసెంబర్ 13 నుంచి 19 వరకు జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాతే రోహిత్ ముంబై జట్టుతో కలిసే అవకాశం ఉంది. అప్పటికి ముంబై ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసి ఉంటుంది. డిసెంబర్ 21న సర్వీసెస్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు?

రోహిత్ విజయ్ హజారే ట్రోఫీలో ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలంక సిరీస్ తర్వాత టోర్నీలో ఆడేందుకు రోహిత్ అందుబాటులో ఉంటానని చెప్పాడు. అయితే ఎన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాడనే విషయాన్ని తర్వాత స్వయంగా వెల్లడిస్తానని తెలిపినట్లు సమాచారం. జనవరి 3 నుంచి భారత్, జింబాబ్వే మధ్య వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఈ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటే రోహిత్ విజయ్ హజారే ట్రోఫీలో మూడు నుంచి నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతేడాది రెండు మ్యాచ్‌లు

రోహిత్ గతేడాది కూడా విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే ఆ తర్వాత ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అయినప్పటికీ అతడి దూకుడు బ్యాటింగ్ మరోసారి చర్చనీయాంశమైంది.

39 సెంచరీలతో భారీ రికార్డు

రోహిత్ శర్మ లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇప్పటివరకు 364 మ్యాచ్‌లు ఆడి 14,517 పరుగులు చేశాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి టోర్నీల్లో ఆడటం రోహిత్‌కు ఉపయోగపడనుంది. ముంబై అభిమానులు కూడా తమ స్టార్ ఆటగాడి రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో హిట్‌మ్యాన్ ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడో, ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us