Indian Cricket Team: కోహ్లీ తరువాత రోహిత్ శర్మ మాత్రమే కాదు.. కెప్టెన్ పోటీల్లో వీరు కూడా..!

|

Sep 17, 2021 | 8:01 AM

2017లో మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ భారత వన్డే, టీ 20 జట్టు కెప్టెన్ అయ్యాడు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ బాధ్యతను స్వీకరించిన తరువాత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు.

Indian Cricket Team: కోహ్లీ తరువాత రోహిత్ శర్మ మాత్రమే కాదు.. కెప్టెన్ పోటీల్లో వీరు కూడా..!
Virat Kohli
Follow us on

Indian Cricket Team: భారత టీ 20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. యూఏఈలో జరిగే టీ 20 ప్రపంచకప్ తర్వాత అతను ఈ పదవి నుంచి వైదొలగనున్నాడు. అయితే, టెస్టులు, వన్డేలలో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతాడు. 2017 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని విడిచిపెట్టిన తర్వాత విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్లలో భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు టీ 20 జట్టు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తప్పుకోనున్నాడు. కోహ్లీ 45 టీ 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, 29 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. కానీ, ప్రస్తుతం అతని కెప్టెన్సీని వదిలిపెట్టిన తర్వాత, తదుపరి కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న నెలకొంది.

రిషబ్ పంత్- ఈ 23 ఏళ్ల వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్నారు. వేగవంతమైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన రిషబ్ పంత్, తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభ రోజుల్లో కొంచెం తడబగినా.. తరువాత ధాటిగానే ప్రారంభించాడు. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. 2018 లో తిరిగి వచ్చినప్పటి నుంచి రిషబ్ ఆట పూర్తిగా మారిపోయింది. టెస్ట్, వన్డే, టీ 20 జట్లలో భాగంగా ఉన్నాడు. అలాగే, అతను ఐపీఎల్‌లో కూడా బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021 లో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో, ఢిల్లీ ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. ప్రస్తుతం మిగిలిన మ్యాచ్‌లలో కూడా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌తే కొనసాగుతాడు. పంత్ దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2007 లో ధోనీ కెప్టెన్ అయినప్పుడు చాలామంది సీనియర్‌ల కంటే కూడా అతనికి ప్రాధాన్యతను ఇచ్చారు. అలాంటి అద్భుతమే జరగొచ్చని అనుకుంటున్నారు.

శ్రేయాస్ అయ్యర్- ఈ ముంబై క్రికెటర్ 2018 నుంచి ఐపీఎల్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. అతని నాయకత్వంలో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టు ఇంతకు ముందు ఎప్పుడూ ఫైనల్ ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీతో చాలా ఆకట్టుకున్నాడు. అతను సీనియర్ ఆటగాళ్లతో చక్కగా సమన్వయపరుచుకున్నాడు. యువతను కూడా ముందుకు తీసుకెళ్లాడు. దేశీయ క్రికెట్‌లో ముంబైకి కెప్టెన్సీ బాధ్యతలు కూడా శ్రేయస్ అయ్యర్ నిర్వహించారు. అతను టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నాడంటే ఆశ్చర్యపోనక్కరలేదు.

కేఎల్ రాహుల్ – టీమిండియా టీ 20 కెప్టెన్సీకి మరో పోటీదారు. రాహుల్ వయస్సు 29 సంవత్సరాలు. రాహుల్‌కు చాలా అనుభవం ఉంది. 2019 నుంచి పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జట్టుకు విజయాన్ని అందించలేకపోయినప్పటికీ అది అతని తప్పుగా కనిపించదు. ఇందులో అతని తప్పిదం కంటే జట్టు పనితీరు చాలా బాధ్యత వహిస్తుంది. టీ 20 క్రికెట్ పరంగా అతను కెప్టెన్సీలో మంచి ఎంపిక అని కొందరు మాజీలు అంటున్నారు.

రోహిత్ శర్మ- హిట్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన ఈ ఆటగాడు టీమిండియా కెప్టెన్ కావడానికి అతిపెద్ద పోటీదారు. రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కోసం ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీని గెలిపించాడు. దీంతో పాటు, ఆసియా కప్, నిదాహాస్ ట్రోఫీని కూడా భారత్ గెలుచుకుంది. రోహిత్ శర్మ సహజ కెప్టెన్‌గా పరిగణలో ఉన్నాడు. కోహ్లీ స్థానాన్ని సులభంగా పూరించగల వాళ్లలో రోహిత్ ముందుంటాడు. వన్డేలు, టీ 20 ల్లో భారత వైస్ కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే రోహిత్‌ను కెప్టెన్‌ చేయడంలో లేట్ చేశారని, ఇప్పటికైనా ఆ అవకాశం ఇవ్వాలని పలువరు మాజీలు కోరుతున్నారు.

Also Read: Virat Kohli: 2023 వన్డే ప్రపంచ కప్‌ కోసమే టీ20 కెప్టెన్సీ వదిలేశాడా..? కోహ్లీ ప్లాన్ మాములుగా లేదంటోన్న మాజీలు

Virat Kohli: ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వరకు.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నాయంటే?