
Rohit Sharma : సౌతాఫ్రికా పై 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత భారత జట్టు హోటల్‌లో విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా మూడో వన్డేలో తన కెరీర్లో ఫస్ట్ సెంచరీ సాధించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేక్ కట్ చేసి సహచరులకు అందించాడు. కఠినమైన ఆహార నియమాలను పాటించే విరాట్ కోహ్లీ కూడా సంతోషంగా కేక్ తీసుకుని తినగా, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మాత్రం జైస్వాల్ ఆఫర్ చేసిన చిన్న కేక్ ముక్కను కూడా తీసుకోవడానికి నిరాకరించారు. ఈ సందర్భంలో రోహిత్ చేసిన ఒక సరదా వ్యాఖ్య అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
మళ్లీ లావవుతా అన్న రోహిత్
యశస్వి జైస్వాల్ కేక్ ముక్కను రోహిత్ శర్మ వైపు అందిస్తున్నప్పుడు, రోహిత్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. కారణం అడగ్గా నేను మళ్లీ లావవుతాను అని రోహిత్ అనడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్ అయినప్పటి నుంచి రోహిత్ శర్మ 10 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గారు. ఈ ఫిట్‌నెస్ సాధన కోసం ఆయన కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నారు. కేక్ ముక్కను కూడా తినడానికి నిరాకరించడం, తన ఫిట్‌నెస్ విషయంలో ఆయన ఎంత క్రమశిక్షణతో ఉన్నారో స్పష్టం చేసింది.
After India’s win in Vizag, the team was celebrating at the hotel by cutting a victory cake. When Jaiswal went to feed the cake to Rohit Sharma, Rohit said, "nahi bhai, me Mota ho jauga vapas"😭❤️
bRO is following a very strict diet.🫡🔥 pic.twitter.com/UGlHGHQdoY
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 7, 2025
సౌతాఫ్రికా సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన
రాంచీలో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ 51 బంతుల్లో వేగంగా 57 పరుగులు చేసి సిరీస్‌ను బలంగా ప్రారంభించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా, అతను పురుషుల వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన షహీద్ అఫ్రిది సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టాడు. రెండో మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయ్యే ముందు అతను కేవలం 14 పరుగుల చిన్న ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో, రోహిత్ కీలక పాత్ర పోషించి, భారత్ ఛేజింగ్‌కు నాయకత్వం వహించాడు. ఈ సిరీస్ గెలిచే ప్రదర్శనలో, అతను 73 బంతుల్లో కీలకమైన 75 పరుగులు చేసి, తన 61వ వన్డే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఈ ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్‌తో కలిసి 155 పరుగుల మ్యాచ్-విజేత ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి సహాయపడింది. ఈ నాక్‌లో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల ముఖ్యమైన మైలురాయిని కూడా దాటాడు. మొత్తంగా రోహిత్ ఈ సిరీస్‌లో 146 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.