Rohit Sharma: రోహిత్‌ శర్మ గాయపడలేదు..! కావాలనే CSK మ్యాచ్‌లో పాల్గొనలేదు.. ఎందుకంటే..?

Rohit Sharma: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండో దశలో మొదటి

Rohit Sharma: రోహిత్‌ శర్మ గాయపడలేదు..! కావాలనే CSK మ్యాచ్‌లో పాల్గొనలేదు.. ఎందుకంటే..?
Rohit Sharma

Updated on: Sep 22, 2021 | 4:13 PM

Rohit Sharma: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండో దశలో మొదటి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్‌కి కెప్టెన్ రోహిత్‌ శర్మ దూరంగా ఉండటం ఇప్పుడు వివాదంగా మారింది. కోచ్ మహేళ జయవర్దనే రోహిత్‌ గాయంతో బాధపడుతున్నట్లు చెప్పాడు. కానీ అది అబద్దమని కొంతమంది ఆరోపిస్తున్నారు. కావాలనే రోహిత్‌ శర్మ చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పాల్గొనలేదని అంటున్నారు.

2023 వరల్డ్ కప్ సన్నాహాల్లో రోహిత్ ఇప్పటికే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రోహిత్ అలసిపోకుండా ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటున్నట్లు చెబుతున్నారు. గత రెండు సీజన్లలో కూడా రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ కారణం వల్లే ఆడలేదని తెలుస్తోంది. ఐపిఎల్ 2020 లో రోహిత్ గాయం కారణంగా అనేక మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ వచ్చే రెండేళ్ల పాటు టీమ్ ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ తర్వాత వరల్డ్ కప్ వస్తుంది. రోహిత్ అందుకే అవసరాన్ని బట్టి విరామాలు తీసుకుంటున్నాడు. రోహిత్ శర్మ వయసు 34 సంవత్సరాలు. అతను తన కెరీర్‌లో చివరి 2-3 సంవత్సరాలు భారతదేశం కోసం ఆడాలనుకుంటున్నట్లు కొంతమంది క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

గత సంవత్సరంలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ ఓపెనర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తర్వాత అతను ఇంగ్లాండ్ పర్యటనలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అయితే ఇప్పటి నుంచి 2023 అక్టోబర్ వరకు పూర్తిగా ఫిట్ గా, సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. స్వదేశంలో అంటే భారతదేశంలో జరిగే ప్రపంచ కప్ కోసం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 2023 నాటికి భారతదేశం మూడు ప్రపంచ కప్‌లు ఆడాలి. వీటిలో రెండు టీ 20 లు ఒకటి 50 ఓవర్ల ప్రపంచ కప్ ఉన్నాయి. అయితే 2011 ప్రపంచకప్‌లో ఆడకపోవడం రోహిత్‌ని చాలాసార్లు నిరాశ పరిచింది. భారతదేశంలో జరిగే ప్రపంచకప్‌లో ఆడలేకపోవడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. 2023 వరల్డ్ కప్ ద్వారా ఈ కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తున్నాడు.

Kushboo: రోజురోజుకూ కుష్బూ వయస్సు తగ్గుతోంది.. ఈ ఫోటోలే సాక్ష్యం

Priyamani: అందాలతో అదరకొడుతున్న ప్రియమణి లేటెస్ట్ ఫోటో గేలరీ

Cars Air Bags: చిన్న కార్లలలో కూడా కనీసం 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలి: కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు