Viral Video : రిషబ్‌ పంత్ రనౌట్‌.. రియాన్ పరాగ్ బిహు డ్యాన్స్‌..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

|

Apr 16, 2021 | 8:38 AM

Riyan Parag Celebrates : ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గురువారం అద్భుతమైన మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి

Viral Video : రిషబ్‌ పంత్ రనౌట్‌.. రియాన్ పరాగ్ బిహు డ్యాన్స్‌..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Riyan Parag Celebrates
Follow us on

Riyan Parag Celebrates : ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గురువారం అద్భుతమైన మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్ అత్యధికంగా 51 పరుగులు చేశాడు. రిషబ్ పంత్‌ను ర్యాన్ పరాగ్ రనౌట్ చేసి పెవిలియన్ వైపు పంపించాడు. దీని తరువాత పరాగ్ తన శైలిలో బిహు నృత్యం చేయడం ద్వారా అందరిని ఆకర్షించాడు. ఇప్పుడు అతడి డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నృత్యానికి సంబంధించిన వీడియోను ఐపిఎల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌తో షేర్ చేసింది. ఇది నెటిజన్లకు బాగా నచ్చుతోంది. 13 వ ఓవర్‌ నాలుగో బంతిని పంత్ లెగ్‌ సైడ్‌కి నెట్టి పరుగు కోసం పరిగెత్తాడు. కానీ ఈలోగా పరాగ్ వేగంగా పరిగెత్తి బంతిని తీసుకొని రనౌట్‌ చేశాడు. పంత్ ను అవుట్ చేసిన తరువాత పరాగ్ మైదానంలో బిహు డ్యాన్స్‌ చేస్తూ సంబరపడిపోయాడు.

తొలి పోరులో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతికి ఓటమి పాలైన రాజస్థాన్‌ రాయల్స్‌.. ఈ సారి టాపార్డర్‌ విఫలమైనా మోరిస్‌ (18 బంతుల్లో 36 నాటౌట్‌; 4 సిక్సర్లు), మిల్లర్‌ (43 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో తొలి విజయం నమోదు చేసుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (32 బంతుల్లో 51; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. రాజస్థాన్‌ బౌలర్లలో జైదేవ్‌ ఉనాద్కత్‌ 3, ముస్తఫిజుర్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3, వోక్స్‌, రబడ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉనాద్కత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Black Magic: ఇంతటి దారుణం మరెక్కడా చూసుండరు.. విషయం తెలిస్తే ఆమె అసలు తల్లేనా అంటూ ఛీ కొడతారు..!

YS Sharmila: వైఎస్‌ షర్మిల ఉద్యోగ దీక్ష భగ్నం… అయినా తెలంగాణలో పాదయాత్ర చేసి తీరుతా.. ( వీడియో )