Rishabh Pant : పంత్ భయ్యా ఫోర్ పోకుండా అడ్డుకోవడమే వారి పని.. బంతి ఆపినందుకు అంత ఫీలవ్వాల ?

లార్డ్స్ టెస్ట్ మూడో రోజున రిషబ్ పంత్ ఒక బౌండరీని మిస్ చేసుకుని నిరాశ చెందాడు. అతని ఆవేదన స్టంప్ మైక్‌లో రికార్డైంది. గాయంతో బాధపడుతున్నప్పటికీ పంత్ బ్యాటింగ్‌లో దూకుడుగా కనిపించాడు. మూడో రోజు టీం ఇండియా లంచ్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగుల చేసింది.

Rishabh Pant : పంత్ భయ్యా ఫోర్ పోకుండా అడ్డుకోవడమే వారి పని.. బంతి ఆపినందుకు అంత ఫీలవ్వాల ?
Rishabh Pant

Updated on: Jul 12, 2025 | 5:57 PM

Rishabh Pant : రిషబ్ పంత్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి బంతులను అయినా సులభంగా బౌండరీ అవతలకు పంపించే సత్తా ఉన్న బ్యాట్స్ మెన్. గాయం కారణంగానో లేదా మరేదో కారణంగానో భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజున బౌండరీలను కొట్టేందుకు పంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. బౌండరీ మిస్ కావడంతో ఒకానొక సమయంలో నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే పంత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడడం చాలా కీలకం కాకపోతే లంచ్ కు ముందు టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్ 74 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీని తర్వాత అంపైర్లు లంచ్ డిక్లేర్ చేశారు. మరోవైపు, కెఎల్ రాహుల్ 98 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.

ఒకానొక సమయంలో రిషబ్ పంత్ బౌండరీగా వెళ్లాల్సిన బంతిని మిస్ చేసుకోవడంతో పెద్దగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టంప్ మైక్ పంత్ బౌండరీ మిస్సవడంతో ఎంత బాధపడ్డాడో రికార్డు చేసింది.ఈ సంఘటన ఇన్నింగ్స్ 51వ ఓవర్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జరిగింది. వోక్స్ షార్ట్ అండ్ వైడ్ డెలివరీ వేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన పంత్ బంతిని గట్టిగా కొట్టాడు. కానీ అది నేరుగా కవర్స్‌లో ఉన్న బెన్ స్టోక్స్ చేతిలోకి వెళ్లింది. బౌండరీ మిస్సవడంతో పంత్ చాలా నిరాశ చెందాడు.

పంత్ మూడో రోజు ఆటను జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బౌండరీతో ప్రారంభించాడు. ఆ తర్వాత రెండు బంతులకే మళ్లీ అదే బౌలర్‌పై మరో ఫోర్ కొట్టాడు. లార్డ్స్ టెస్ట్ రెండో రోజు పంత్ వికెట్ కీపింగ్ చేయలేదు. మొదటి రోజు బౌండరీని ఆపడానికి ప్రయత్నించి వేలికి గాయం కావడంతో అతను కోలుకుంటున్నాడు. అయినప్పటికీ, బ్యాటింగ్‌లో పంత్ మంచి ఫామ్‌లో కనిపించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 33 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

కేఎల్ రాహుల్(53 నాటౌట్)తో కలిసి పంత్ 38 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జోడించి, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసిన తర్వాత భారత జట్టును నిలబెట్టాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. మూడో రోజు టీం ఇండియా లంచ్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగుల చేసింది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..