ఈ మధ్య రింకూ సింగ్‌కు లక్ బాగా కలిసోస్తుంది. ఇటీవల, KKR అతనిని 13 కోట్ల రూపాయల భారీ ధరకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. రింకూ సింగ్ KKR కొత్త కెప్టెన్ కావచ్చు అని వార్తలు వస్తున్నాయి. గత ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌ను ఈసారి రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు అయ్యర్ స్థానంలో రింకూకి నాయకత్వం అప్పగించవచ్చని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేయలేదు. కేకేఆర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోనే చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అయ్యర్ తప్పుకోవడంతో, తదుపరి కెప్టెన్ ఎవరన్నది మేనేజ్‌మెంట్ ముందున్న పెద్ద ప్రశ్న మరియు రింకూ సింగ్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రింకూ సింగ్ KKR కెప్టెన్‌గా ఉంటాడా అనే మరో ప్రశ్న కూడా లేవనెత్తుతుంది.
రింకూ సింగ్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇప్పుడు అతను ఐపిఎల్ మరియు టీమ్ ఇండియా రెండింటిలోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రింకూ మ్యాగ్జిమమ్ ప్రెజర్ ఉన్న మ్యాచ్ ఫినిషర్ అని, ఒత్తిడిని తట్టుకునే సత్తా తనకు ఉందని రింకూ నిరూపించుకున్నాడు. కాబట్టి రింకూ సింగ్ కెప్టెన్‌గా రాణించగలడు. రింకూ UP T20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది.
రింకు సింగ్ చాలా కాలంగా KKRలో ఉన్నాడు, అందువల్ల అతనికి జట్టు మేనేజ్‌మెంట్ గురించి బాగా తెలుసు. అతనికి జట్టులోని ప్రతి ఆటగాడి గురించి తెలుసు. అందరితో మంచి ర్యాపో కూడా రింకూ సింగ్‌కు ఉంది. ఏ ఆటగాడినైనా కెప్టెన్‌గా చేయడానికి ముందు జట్టు ఈ లక్షణాల కోసం చూస్తుంది. రింకూ ఈ లక్షణాలు ఉన్నాయని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. KKR నిజంగా రింకూ సింగ్‌ను కెప్టెన్‌గా చేస్తుందా లేదా అనేది చూడాలి.