AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా @ 400.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డ్‌.. అదేంటంటే?

Rewind 2026: భారత క్రికెట్ చరిత్రలో 2026 సంవత్సరం సిక్సర్ల విధ్వంసానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించింది. ఈ రికార్డు వెనుక అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి విధ్వంసకర బ్యాటర్ల పాత్ర ఎంతో కీలకం.

Team India: టీమిండియా @ 400.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డ్‌.. అదేంటంటే?
Team India Six Records
Venkata Chari
|

Updated on: Nov 13, 2026 | 10:48 AM

Share

Rewind 2026: 2026లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ శైలి పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ప్రత్యర్థి ఎవరైనా, మైదానం ఏదైనా సిక్సర్లతో విరుచుకుపడటమే లక్ష్యంగా టీమిండియా బ్యాటర్లు ఆడారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఎవరూ సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2026 నవంబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు.

400వ సిక్సర్ కొట్టింది ఎవరంటే?

హామిల్టన్‌లోని సెడ్డాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ ఈ చారిత్రాత్మక ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 11 సిక్సర్లు బాదడంతో ఏడాది మొత్తం సిక్సర్ల సంఖ్య 400కు చేరింది. ఆల్‌రౌండర్ నామన్ ధీర్ 19వ ఓవర్‌లో బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టి ఈ రికార్డుకు కారణమయ్యాడు. అప్పటివరకు ఈ ప్రపంచ రికార్డు ఆస్ట్రియా పేరిట ఉండేది. 2025లో ఆ జట్టు 326 సిక్సర్లు బాదింది. ఇప్పుడు ఆ రికార్డును భారత్ అధిగమించింది.

అభిషేక్ శర్మ టాప్.. ఇషాన్, సంజూ కూడా!

భారత సిక్సర్ల వేటలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. 2026లో అతడి ఖాతాలో ఏకంగా 86 సిక్సర్లు చేరాయి. ఇషాన్ కిషన్ 60 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, సంజూ శాంసన్ 50 సిక్సర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ గణాంకాలు భారత బ్యాటింగ్‌లో దూకుడు ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌పై మరో రికార్డు!

ఈ ఏడాది భారత్ సాధించిన 400 సిక్సర్లలో ఏకంగా 142 సిక్సర్లు న్యూజిలాండ్‌పై రావడం మరో ఆసక్తికరమైన విషయం. ఒకే ప్రత్యర్థిపై ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగానూ భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. 2022లో 40 మ్యాచ్‌ల్లో భారత్ 289 సిక్సర్లు మాత్రమే బాదింది. కానీ 2026లో 40వ మ్యాచ్‌కే 400 సిక్సర్ల మార్కును అందుకోవడం విశేషం.

టీ20 క్రికెట్‌లో దూకుడు బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనం చెబుతున్న భారత జట్టు.. 2026ను సిక్సర్ల సంవత్సరంగా మార్చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్ల విధ్వంసం ఈ ప్రపంచ రికార్డులో కీలక పాత్ర పోషించింది. ఏడాది ముగిసేలోపు ఈ సంఖ్య మరెంత పెరుగుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us