RCB vs RR Playing XI: టాస్ గెలిచిన రాజస్థాన్.. రంగంలోకి కీలక ప్లేయర్లు.. ప్లేయింగ్ XI, ఇంపాక్ట్ లిస్ట్ ఇదే..

Royal Challengers Bangalore vs Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు నాలుగో సూపర్ సండే. తొలి మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది.

RCB vs RR Playing XI: టాస్ గెలిచిన రాజస్థాన్.. రంగంలోకి కీలక ప్లేయర్లు.. ప్లేయింగ్ XI, ఇంపాక్ట్ లిస్ట్ ఇదే..
Rcb Vs Rr Live

Updated on: Apr 23, 2023 | 3:12 PM

RCB vs RR IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు నాలుగో సూపర్ సండే. తొలి మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాజస్థాన్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పు లేకుండానే RR జట్టు బరిలోకి దిగింది. అదే సమయంలో బెంగళూరులో ఒక మార్పు వచ్చింది.

RCB హోమ్ గ్రౌండ్ ఎం చిన్నస్వామి మైదానంలో రెండు జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ నాలుగు, బెంగళూరు రెండింట్లో విజయం సాధించాయి. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ విధంగా చూస్తే ఈ గడ్డపై రాజస్థాన్ రికార్డు బెంగళూరు కంటే మెరుగ్గా ఉంది. మరోవైపు నేటి రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి.

ఇరుజట్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి(కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.

ఇవి కూడా చదవండి

RCB ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

RR ఇంపాక్ట్ ప్లేయర్స్: డోనావన్ ఫెరీరా, ఎం. అశ్విన్, ఆకాష్ వశిష్ట్, కేఎం ఆసిఫ్, అబ్దుల్ బాసిత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us