Royal Challengers Bangalore vs Punjab Kings Highlights: ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో పంజాబ్ 54 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. బెంగుళూరు ఏ దశలో లక్ష్యాన్ని ఛేదించే దిశగా కనిపించలేదు. గ్లెన్ మాక్స్‌వెల్ 35 పరుగులు, రజతత్ పాటిదర్ 26 పరుగులు, విరాట్ కోహ్లీ 20 పరుగులు మినహాయించి ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. పంజాబ్ బౌలర్లలో కాగిసో రబడా 3, రిషి ధావన్ 2, రాహుల్ చాహర్ 2, హర్‌ప్రీత్ 1, హర్ష్‌దీప్ సింగ్ 1 వికెట్ సాధించారు. దీంతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకున్నట్లు అయింది.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ తొలి నుంచి పరుగుల వర్షం కురిపించింది. జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడడంతో పంజాబ్ స్కోర్ బోర్డ్ దూసుకుపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి కేవలం 30 బంతుల్లోనే 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అనంతరం ధావన్ వెనుదిరిగినా దూకుడుగా ఆడి కేవలం 29 బంతుల్లోనే 66 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ కూడా ఎక్కడా తగ్గలేదు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. ఓవైపు వికెట్లు పడుతోన్నా జట్టు స్కోర్‌లో మాత్రం వేగం తగ్గకుండా చూసుకున్నాడు. 42 బంతుల్లో 70 పరుగులు సాధించి జట్టు స్కోర్ బోర్డులో కీలక పాత్ర పోషించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్), మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, మయాంక్ అగర్వాల్ (c), జితేష్ శర్మ (wk), లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ
ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో బెంగళూరును పంజాబ్ ఓడించింది. దీంతో బెంగళూరు ఎలాగైనా దెబ్బకు దెబ్బకొట్టాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌లో విజయం ఇటు బెంగళూరుతో పాటు, పంజాబ్‌కు కూడా కీలకంగా మారనుంది. టోర్నీలో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది.
బెంగుళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు ఏ దశలో లక్ష్యాన్ని ఛేదించే దిశగా కనిపించలేదు. గ్లెన్ మాక్స్‌వెల్ 35 పరుగులు, రజతత్ పాటిదర్ 26 పరుగులు, విరాట్ కోహ్లీ 20 పరుగులు మినహాయించి ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. పంజాబ్ బౌలర్లలో కాగిసో రబడా 3, రిషి ధావన్ 2, రాహుల్ చాహర్ 2, హర్‌ప్రీత్ 1, హర్ష్‌దీప్ సింగ్ 1 వికెట్ సాధించారు.
బెంగుళూరు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ 11 పరుగులకి ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి143 పరుగులు చేసింది.
బెంగుళూరు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వనిందు హసరంగ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ 16.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 19 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉంది.
బెంగుళూరు ఏడో వికెట్ కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ 9 పరుగులకి ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ 15.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 25 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది.
బెంగుళూరు15 ఓవర్లకి 6 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ 5 పరుగులు, హర్షల్ పటేల్ 0 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 29 బంతుల్లో 90 పరుగులు కావాలి. పంజాబ్ బౌలర్లలో రిషి ధావన్ 2, రాహుల్ చాహర్ 1, కాగిసో రబడా 1, హర్‌ప్రీత్ 1, హర్ష్‌దీప్ సింగ్ 1 వికెట్ సాధించారు.
బెంగుళూరు ఆరో వికెట్ కోల్పోయింది. దినేశ్ కార్తీక్ 11 పరుగులకి ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ 41.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. విజయానికి ఇంకా31 బంతుల్లో 90 పరుగులు చేయాల్సి ఉంది.
బెంగుళూరు ఐదో వికెట్ కోల్పోయింది. గ్లేన్ మాక్స్‌వెల్ 35 పరుగులకి ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ 11.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 52 బంతుల్లో 106 పరుగులు చేయాల్సి ఉంది.
బెంగుళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. రజత్ పాటిదార్ 26 పరుగులకి ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 54 బంతుల్లో 106 పరుగులు కావాలి.
బెంగుళూరు 10.2 ఓవలర్లలో 3 వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసింది. గ్లేన్ మాక్స్‌వెల్ 34 పరుగులు, రజత్ పాటిదార్ 26 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 57 బంతుల్లో 109 పరుగులు కావాలి.
బెంగుళూరు10 ఓవర్లకి 3 వికెట్లు నష్టపోయి 95 పరుగులు చేసింది. గ్లేన్ మాక్స్‌వెల్ 28 పరుగులు, రజత్ పాటిదార్ 26 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 61 బంతుల్లో 117 పరుగులు కావాలి.
బెంగళూరుకు విరాట్ కోహ్లీ రూపంలో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రబాడా బౌలింగ్‌లో రాహుల్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు విరాట్.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు సాధించింది. జానీ బెయిర్‌స్టో 29 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంబాన్ని ఇచ్చాడు. తర్వత లివింగ్‌స్టోన్ (70), పరుగులతో చెలరేగాడు. ఒక ఓవైపు వరుస వికెట్లు పోయినా జట్టు స్కోర్ 209 పరుగులు సాధించింది.
42 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు స్కోర్ పెంచిన లివింగ్‌స్టోన్ అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
బెయిర్‌స్టో స్థానాన్ని భర్తీ చేస్తూ లివింగ్ స్టోన్ దుమ్మురేపుతున్నాడు. కేవలం 40 బంతుల్లోనే 70 పరుగులు సాధించి దూసుకుపోతున్నాడు లివింగ్ స్టోన్. దీంతో జట్టు స్కోర్ భారీ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ 205 పరుగుల వద్ద కొనసాగుతోంది.
పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్పీత్ బ్రాక్ 7 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
పంజాబ్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. హసనరంగా బౌలింగ్‌లో జితేశ్ శర్మ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సమయానికి 166 పరుగుల వద్ద కొనసాగుతోంది.
బెయిర్‌స్టో పెవిలియన్ బాట పట్టిన తర్వాత పంజాబ్ స్కోర్ కాస్త నెమ్మదించినా లివింగ్‌స్టోన్ దూకుడుతో మళ్లీ స్కోర్ బోర్డ్ ఊపందుకుంది. 29 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ స్కోర్ 153 పరుగుల వద్ద కొనసాగుతోంది.
పంజాబ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు స్కోర్‌ను జట్ స్పీడ్‌తో పెంచిన బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 66 పరుగులు సాధించిన బెయిర్‌స్టో.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
జానీ బెయిర్‌స్టో దూకుడుతో పంజాబ్ స్కోర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. 9 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 100 పరగుల మార్క్‌ను దాటేసింది. ఇక బెయిర్‌స్టో కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు సాధించడం విశేషం.
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. భానుక రాజపక్సే కేవలం 1 పరుగు మాత్రమే చేసి హసరంగా బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
శిఖర్ ధావన్ అవుట్ అయిన తర్వాత కూడా బెయిర్‌స్టో ఏమాత్రం తగ్గడం లేదు. వరుస బౌండరీలతో స్కోరును పరుగులెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 21 బంతుల్లోనే 53 పరుగులు పూర్తి చేశాడు.
జట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న పంజాబ్ స్కోర్ బోర్డ్‌కు బ్రేకులు పడ్డాయి. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి పంజాబ్ 60 పరుగుల వద్ద కొనసాగుతోంది.
టాస్ ఓడి తొలుత బ్యాంటింగ్‌కు దిగిన పంజాక్‌కు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో శుభారంభం ఇచ్చారు. మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. 12 బంతుల్లోనే 34 పరగులు చేశాడు. దీంతో పంజాబ్ స్కోర్ 3 ఓవర్లు ముగిసే సమయానికి 43 పరుగుల వద్ద కొనసాగుతోంది.
కీలక మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. డ్యూ, పిచ్ చేజింగ్‌కు అనుకూలిస్తుండడంతో బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.