RCBకి సపోర్ట్‌గా బరిలోకి దూకిన రాష్ట్ర ప్రభుత్వం..! వీడియో రిలీజ్‌ చేసిన డిప్యూటీ సీఎం.. ఇక ఈ సాలా కప్‌..

ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. 17 సీజన్ల తర్వాత తమ తొలి ట్రోఫీ కోసం ఆర్సీబీ ఆశిస్తోంది. కర్ణాటక ఉప ముఖ్య మంత్రి శివకుమార్ ఆర్సీబీకి మద్దతు ప్రకటించారు. రెండు జట్లు కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు.

RCBకి సపోర్ట్‌గా బరిలోకి దూకిన రాష్ట్ర ప్రభుత్వం..! వీడియో రిలీజ్‌ చేసిన డిప్యూటీ సీఎం.. ఇక ఈ సాలా కప్‌..
Rcb

Updated on: Jun 03, 2025 | 4:15 PM

ఆర్సీబీ ఒక బిగ్‌ మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది. గత 17 సీజన్లుగా సాధించలేనిది.. ఈ సీజన్‌లో ఎలాగైనా సాధించాలనే కసితో కలతో ఆర్సీబీ బరిలోకి దిగబోతుంది. ఐపీఎల్‌ 2025లో భాగంగా నేడు ( మంగళవారం, జూన్‌ 3 ) పంజాబ్‌ కింగ్స్‌తో అహ్మాదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్‌ కూడా ఐపీఎల్‌ ట్రోఫీ లేదు. ఎవరు గెలిచినా.. ఐపీఎల్‌లో మరో కొత్త ఛాంపియన్‌ అవతరించబోతుంది. ప్రస్తుతానికి రెండు టీమ్స్‌కు సమాన మద్దతు లభిస్తోంది. ఒక వైపు విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌ ఆరంభం నుంచి ట్రోఫీ కోసం పోరాటం చేస్తున్నాడని, ఆర్సీబీ కప్పు గెలవాలని కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు.

మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా ఎంతో కష్టపడుతున్నాడని, పంజాబ్‌ కింగ్స్‌కు కూడా ఒక ట్రోఫీ రావాలని అంతే మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి మద్దతుగా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే బరిలోకి దిగింది. ఆర్సీబీ జట్టుకు సపోర్ట్‌ చేస్తూ.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీడియో చేయడం విశేషం. ఆ రాష్ట్రం ఏదంటే.. కర్ణాటక. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్‌ ఆర్సీబీకి కప్పు కొట్టాలని, యావత్‌ కర్ణాటక ఆర్సీబీ వెంట ఉందంటూ ఒక వీడియో రిలీజ్‌ చేశారు. ఆర్సీబీ కర్ణాటక రాజధాని బెంగళూరు బేస్డ్‌ ఫ్రాంచైజీ అనే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

మనకు సన్‌రైజర్స్‌ ఎలాగో కర్ణాటకకు ఆర్సీబీ అలాగే. 18 ఏళ్లుగా ఇలాంటి మూమెంట్‌ కోసం ఎదురుచూస్తున్నామని.. ఈ సారి కచ్చితంగా కప్పు గెలిచి.. ఈ సాలా కప్‌ నమ్‌దే అంటూ శివకుమార్‌ అన్నారు. మరి చూడాలి.. ఈ రోజు ఆర్సీబీ ఏం చేస్తుందో? పంజాబ్‌, ఆర్సీబీ ఈ రెండు టీమ్స్‌లో ఎవరు తమ తొలి కప్పును ముద్దాడుతాయో చూసేందుకు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..