RCB vs MI Live Score: దంచికొట్టిన కోహ్లీ, డుప్లెసిస్.. ముంబైను చిత్తు చేసిన బెంగళూరు

| Edited By: Basha Shek

Apr 02, 2023 | 11:05 PM

Royal challengers Bangalore team vs Mumbai Indians IPL 2023 Live Score in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ 5వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది.

RCB vs MI Live Score: దంచికొట్టిన కోహ్లీ, డుప్లెసిస్.. ముంబైను చిత్తు చేసిన బెంగళూరు
Rcb Vs Mi

RCB vs MI Live Score: ఐపీఎల్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ గత సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేదు. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి రోహిత్ సారథ్యంలోని ఈ జట్టు మళ్లీ పాత ఫాంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఐపీఎల్-2023 తొలి మ్యాచ్‌లో ఈ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ముంబైకి తొలి పోరే హోరాహోరీగా ఉండనుంది. బెంగళూరుకు కూడా ఈ మ్యాచ్ అంత సులువు కాదు. ముంబై నిస్సందేహంగా విజయం కోసం ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జస్ప్రీత్ బుమ్రా, ఝే రిచర్డ్‌సన్ గాయం కారణంగా దూరంగా ఉన్నారు. వీరిని ఎలా భర్తీ చేయాలనేది ముంబైకి సవాలుగా మారింది.

ఇరుజట్లు..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 02 Apr 2023 09:32 PM (IST)

    బెంగళూరు ముందు భారీ స్కోర్..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో 5వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) మధ్య బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. తిలక్ తన కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీ సాధించాడు.

  • 02 Apr 2023 09:04 PM (IST)

    తిలక్ వర్మ హాఫ్ సెంచరీ..

    ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తన క్లాసికల్ ఇన్నింగ్స్‌తో 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 02 Apr 2023 08:48 PM (IST)

    14 ఓవర్లకు ముంబై స్కోర్..

    14 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ 1, ఇషాన్ కిషన్ 10, రోహిత్ 1, సూర్యకుమార్ 15, నేహాల్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. సిరాజ్, టోప్లీ, ఆకాష్ దీప్, బ్రేస్ వెల్, శర్మ తలో వికెట్ పడగొట్టారు.

  • 02 Apr 2023 08:31 PM (IST)

    10 ఓవర్లకు ముంబై స్కోర్..

    10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 55 పరుగులు మాత్రమే చేయగలిగింది. కామెరూన్ గ్రీన్ 1, ఇషాన్ కిషన్ 10, రోహిత్ 1, సూర్యకుమార్ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. సిరాజ్, టోప్లీ, ఆకాష్ దీప్, బ్రేస్ వెల్ తలో వికెట్ పడగొట్టారు.

  • 02 Apr 2023 08:02 PM (IST)

    రోహిత్ ఔట్..

    టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై టీం పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే లోపే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ 1 పరుగు చేసి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

  • 02 Apr 2023 08:00 PM (IST)

    5 ఓవర్లకు ముంబై స్కోర్..

    5 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. కామెరూన్ గ్రీన్ 1, ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

  • 02 Apr 2023 07:25 PM (IST)

    రాజస్థాన్ ఘన విజయం..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జట్టు 10వ సారి 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరును కాపాడుకుంది. ఉప్పల్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 02 Apr 2023 07:15 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI..

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్

  • 02 Apr 2023 07:11 PM (IST)

    ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI..

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్.

  • 02 Apr 2023 07:04 PM (IST)

    RCB vs MI: టాస్ గెలిచిన బెంగళూర్..

    టాస్ గెలిచిన బెంగళూర్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

  • 02 Apr 2023 06:34 PM (IST)

    RCB vs MI: మూడేళ్ల తర్వాత సొంత మైదానంలో బెంగళూర్..

    ఆర్‌సీబీ సొంత గడ్డకు తిరిగి వచ్చింది. గత మూడేళ్లలో సొంత మైదానంలో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. దీనికి కారణం కోవిడ్. ఇటువంటి పరిస్థితిలో, RCB విజయవంతమైన పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ముంబై ఇండియన్స్ బెంగళూర్‌ను ఆడ్డుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంది.

Follow us on