New Zealand Vs Bangladesh :18 బంతుల్లో 50 పరుగులు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన న్యూజిలాండ్‌ యువ క్రికెటర్..

|

Apr 01, 2021 | 10:15 PM

New Zealand Vs Bangladesh : బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ -20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ లో కూడా గెలిచి న్యూజిలాండ్ సిరీస్‌ దక్కించుకుంది.

New Zealand Vs Bangladesh :18 బంతుల్లో 50 పరుగులు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన న్యూజిలాండ్‌ యువ క్రికెటర్..
New Zealand Vs Bangladesh
Follow us on

New Zealand Vs Bangladesh : బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ -20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ లో కూడా గెలిచి న్యూజిలాండ్ సిరీస్‌ దక్కించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. న్యూజిలాండ్ యువ క్రికెటర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్‌లో మూడో టీ20 ఆడుతున్న అలెన్‌.. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలెన్(29 బంతుల్లో 71; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసంతో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు చేసి, 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ఫిన్ అలెన్‌కు అండగా మార్టిన్ గప్తిల్(19 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 44) చెలరేగి ఆడాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన బంగ్లా జట్టు.. 9.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మహమ్మద్ నైమ్(19), సౌమ్య సర్కార్( 10), మోసెద్దెక్ హుసేన్(13) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే ఫిన్ అలెన్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఫిన్ అలెన్‌ను ఆర్‌సీబీ కనీస ధరకు(రూ.20 లక్షలు) దక్కించుకున్న విషయం తెలిసిందే.. అలెన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ చూసిన ఆర్‌సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Indian Traditional Games: ఇంటర్నెట్ జనరేషన్ పిల్లలకు తెలియని మన సాంప్రదాయ భారతీయ ఆటలు ఇవే..

IPL 2021: ఐపీఎల్‌కు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ దూరం.!

మూడు మ్యాచ్‌లతో ముగిసిన క్రికెట్ కెరియర్.. సచిన్ మది గెలుచుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా..?