Virat Kohli: విరాట్ కోహ్లీ కెరీర్ కోసం రవిశాస్త్రి సలహా.. పెడచెవిన పెట్టిన టీమిండియా కెప్టెన్

|

Sep 23, 2021 | 10:52 AM

విరాట్ కోహ్లీ కెరీర్‌కు సంబంధించి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే ఓ కీలక సలహా ఇచ్చారట. అయితే ఈ సలహాను విరాట్ కోహ్లీ పెడచెవిన పెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Virat Kohli: విరాట్ కోహ్లీ కెరీర్ కోసం రవిశాస్త్రి సలహా.. పెడచెవిన పెట్టిన టీమిండియా కెప్టెన్
Virat Kohli
Follow us on

Virat Kohli News: విరాట్ కోహ్లీ కెరీర్‌కు సంబంధించి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే ఓ కీలక సలహా ఇచ్చారట. అయితే ఈ సలహాను విరాట్ కోహ్లీ పెడచెవిన పెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకీ కోహ్లీకి రవిశాస్త్రి ఇచ్చిన ఆ సలహా ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ఇటీవల ప్రకటించిన కోహ్లీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అలాగే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. అయితే ఐపీఎల్‌లో ఆడినన్ని రోజులు ఆర్సీబీ ఆటగాడిగానే కొనసాగుతానని చెప్పారు. కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఒత్తిడి ఎక్కువకావడం.. ఆ ప్రభావం తన ఆటపై పడుతున్నందునే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

వాస్తవానికి వన్డేతో పాటు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రవిశాస్త్రి సలహాను విరాట్ కోహ్లీ పెడచెవిన పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ టీమిండియా వన్డే కెప్టెన్‌గా మరింత కాలం కొనసాగాలని కోహ్లీ కోరుకుంటున్నారని.. వన్డే కెప్టెన్సీ‌పై ప్రభావం చూపొద్దనే టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగినట్లు బీసీసీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రవిశాస్త్రి సలహా మేరకు ఆరు నెలల క్రితమే కోహ్లీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటే.. అతని ఆటతీరు మెరుగ్గానే ఉండేదని చెబుతున్నారు.

కెప్టెన్సీ భారాన్ని తగ్గించి.. ఓ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ సేవలను మరింతగా సద్వినియోగం చేసుకోవడంపైనే బీసీసీఐ కూడా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుని తన బ్యాటింగ్‌పైన కోహ్లీ పూర్తిగా దృష్టిసారిస్తే మంచిదన్నది కొందరు బీసీసీఐ అధికారుల అభిప్రాయంగా ఉంది.

Also Read..

నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!

Naga Chaitanya: రానా బాటలో అక్కినేని యంగ్ హీరో.. ఛాలెంజింగ్ రోల్‌కు సై అంటున్న చైతన్య..