విరాట్ కోహ్లీని(Virat Kohli) వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో భారత జట్టుపై ప్రభావం పడిందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) అన్నాడు. విరాట్ కోహ్లీని బీసీసీఐ(BCCI) తొలగించడం పూర్తిగా రాంగ్ స్టెప్ అని చెప్పాడు. ఇప్పుడు టీమ్ ఇండియా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని రషీద్ లతీఫ్ యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు. పాకిస్తాన్ చేస్తున్న తప్పునే భారత్ కూడా చేసిందన్నాడు. ‘టీమ్ ఇండియా ఇప్పుడు డెడ్ ఎండ్‌కు చేరుకుంది. విరాట్ కోహ్లీని తొలగించాలని ఎవరు ప్లాన్ చేసినా నిజంగా చాలా తప్పు. ఇది టీమ్ ఇండియాను దెబ్బతీస్తోంది. ఒక ఆటగాడు 10 సంవత్సరాలు ఆడుతున్నట్లయితే, అతని మూలాలు జట్టులో ఉంటాయి. పాకిస్తాన్‌లో జావేద్ మియాందాద్ విషయంలోనూ అదే జరిగింది.’ అని చెప్పాడు.
అతన్ని తొలగించిన తర్వాత, చాలా మంది కెప్టెన్లు మారారు. మనం కూడా కెప్టెన్‌గా మారగలం అనే భావన అందరిలోనూ మొదలైంది. మీరు భారతదేశం-పాకిస్తాన్ చరిత్ర చూడండి. కెప్టెన్సీలో పెద్ద పేర్లు మాత్రమే కనిపిస్తాయి. కొంతమంది ఆటగాళ్లు మాత్రమే కెప్టెన్ అవుతారు. అందరూ కాదు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు మాత్రమే కెప్టెన్లుగా మారారు.’ అని లతీఫ్ అన్నాడు.
‘విరాట్ కోహ్లీ బలవంతంగా రవిశాస్త్రిని తీసుకువచ్చినప్పటి నుంచి ఈ విషయం ప్రారంభమైంది. అతను రవిశాస్త్రి స్థానంలో 600 కంటే ఎక్కువ టెస్టు వికెట్లు సాధించిన కుంబ్లే వంటి ఆటగాడిని భర్తీ చేయడం ద్వారా ప్రధాన కోచ్‌గా వచ్చాడు. పాకిస్తాన్ లేదా ఇతర దేశాలు చేసిన తప్పులు ఇప్పుడు భారత్ కూడా చేస్తుంది. అని లతీఫ్ పేర్కొన్నాడు.
Read Also.. Rahul Dravid: వన్డే సిరీస్ ఓటమిపై ద్రవిడ్ స్పందన.. వారికి చాలా అవకాశాలు ఇచ్చామంటూ వ్యాఖ్యలు..