Ranji Trophy 2022: నేటి నుంచే రంజీ ట్రోఫీ.. పోటీలో 38 జట్లు.. వారికి మాత్రం చాలా కీలకం..

|

Feb 17, 2022 | 8:40 AM

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గతేడాది వాయిదా పడిన రంజీ సీజన్.. గురువారం నుంచి ప్రారంభం కానుంది. భారత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ గురించి ప్రీమియర్ ఫస్ట్-క్లాస్ పోటీలో చేరిన క్రికెటర్లు ఉత్సాహంగా ఉన్నారు.

Ranji Trophy 2022: నేటి నుంచే రంజీ ట్రోఫీ.. పోటీలో 38 జట్లు.. వారికి మాత్రం చాలా కీలకం..
Ranji Trophy 2022
Follow us on

Ranji Trophy 2022: భారతదేశంలో కోవిడ్-19 కేసుల కారణంగా గతేడాది రంజీ ట్రోఫీని నిర్వహించలేదు. జనవరి 13 నుంచి వార్తల్లో నిలిచిన తరువాత ఎట్టకేలకు రంజీ ట్రోఫీ(Ranji Trophy 2022)కి రంగం సిద్ధమైంది. తొమ్మిది కేంద్రాలు, 57 లీగ్ మ్యాచులు జరగనున్న ఈ సీజన్‌లో మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే బృందాలను ఎనిమిది నిర్దిష్ట సమూహాలుగా, ఒక ప్లేట్ సమూహంగా బీసీసీఐ(BCCI)విభజించారు. బయో-బబుల్ వాతావరణంలో ప్లేయర్లు ఉండనున్నారు. లీగ్ దశలో చాలా జట్లకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయి. అంటే నాకౌట్‌లకు చేరుకోవడంలో పొరపాట్లకు చాలా తక్కువ అవకాశం ఉంది. రంజీ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో తమ తమ జట్లు సౌరాష్ట్ర, ముంబైతో తలపడినప్పుడు సీనియర్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు మొదటి రోజు ఆటలో కనిపిస్తారు. మార్చిలో శ్రీలంకతో జరిగే టెస్టుకు జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నందున, టెస్ట్ క్రికెట్‌లో పునరాగమనం చేయడానికి ఇద్దరూ భారీ ఇన్నింగ్సులు ఆడాల్సి ఉంది. చేయాల్సి ఉంటుంది.

హనుమ విహారి (హైదరాబాద్), నవదీప్ సైనీ (ఢిల్లీ), మయాంక్ అగర్వాల్ (కర్ణాటక), పృథ్వీ షా (ముంబై), జయదేవ్ ఉనద్కత్ (సౌరాష్ట్ర), జయంత్ యాదవ్ (హర్యానా), ఉమేష్ యాదవ్ (విదర్భ) వంటి ఇతర టెస్టు ఆటగాళ్లను కూడా ఈ సీజన్‌లో కనిపించనున్నారు.

దక్షిణాఫ్రికాలో భారత్ A జట్టు పర్యటనలో భాగమైన సభ్యలు కూడా ఇందులో కనిపించనున్నారు. ప్రియాంక్ పంచల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్), సర్ఫరాజ్ ఖాన్ (ముంబై), బాబా అపరాజిత్ (తమిళనాడు), KS భరత్ (ఆంధ్రప్రదేశ్) , కె గౌతమ్ (కర్ణాటక), అర్జన్ నాగ్వాస్వాలా (గుజరాత్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), ఇషాన్ పోరెల్ (బెంగాల్), ఉమ్రాన్ మాలిక్ (జమ్మూ కాశ్మీర్) లాంటి ఆటగాళ్లు రంజీ సీజన్‌లో సందడి చేయనున్నారు.

అలాగు ఇటీవల అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులు సీనియర్ క్రికెట్ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. భారత్‌కు ఐదవ అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన యశ్ ధుల్ ఢిల్లీ జట్టులో చేరాడు. కర్ణాటక జట్టులో అనిశ్వర్ గౌతమ్ కూడా ఉన్నాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ రవికుమార్ బెంగాల్ జట్టులో ఉండగా, హర్నూర్ సింగ్, రాజ్ బావా చండీగఢ్ జట్టులో చేరారు. హర్యానా జట్టులో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ బానా, ఆల్ రౌండర్ నిశాంత్ సింధు చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో స్పిన్నర్లు విక్కీ ఓస్త్వాల్, కౌశల్ తాంబే మహారాష్ట్ర తరపున బరిలోకి దిగనున్నారు.

కోవిడ్-19 ప్రోటోకాల్ విషయానికొస్తే, ఇద్దరు రిజర్వ్ ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవాలని జట్లకు సూచించారు. కోవిడ్ వ్యాప్తి చెందితే, తొమ్మిది మంది ఫిట్ ప్లేయర్‌లతో కూడిన జట్టు మ్యాచ్ ఆడటం కొనసాగించవచ్చు. అలాంటి మ్యాచ్‌లో జట్లకు ఒక్కొక్క పాయింట్ ఇవ్వనున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్య జరిగే మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Also Read: IND vs WI 1st T20: అర్ధ సెంచరీతో రాణించిన నికోలస్‌ పూరన్‌.. టీమిండియా ముందు మోస్తరు లక్ష్యం..

Ipl 2022 Auction: కేకేఆర్‌ కెప్టెన్‌గా టీమిండియా యంగ్‌ ప్లేయర్‌.. అధికారికంగా ప్రకటించిన యాజమాన్యం..