RCB: వేలంలో ఎవరు కొనుగోలు చేయడానికి ప్రయత్నించలేదు.. కానీ ఇప్పుడు సెంచరీతో సమాధానం చెప్పాడు..

|

May 26, 2022 | 7:15 AM

ప్రతి వ్యక్తి ఒక రోజు వాస్తుందని అని అంటారు. చాలా మంది విషయంలో ఇది నిజమవుతుంది. అలాంటి రోజు ఆర్సీబీ(RCB) ఆటగాడు రజత్‌ పాటిదార్‌(Rajat Patidar)కు వచ్చింది. తనదైన రోజు ఎవరు ఏం చేయలేరనేది ఇతని ఆటను బట్టి తెలుస్తుంది...

RCB: వేలంలో ఎవరు కొనుగోలు చేయడానికి ప్రయత్నించలేదు.. కానీ ఇప్పుడు సెంచరీతో సమాధానం చెప్పాడు..
Rajath Patidar
Follow us on

ప్రతి వ్యక్తి ఒక రోజు వాస్తుందని అని అంటారు. చాలా మంది విషయంలో ఇది నిజమవుతుంది. అలాంటి రోజు ఆర్సీబీ(RCB) ఆటగాడు రజత్‌ పాటిదార్‌(Rajat Patidar)కు వచ్చింది. తనదైన రోజు ఎవరు ఏం చేయలేరనేది ఇతని ఆటను బట్టి తెలుస్తుంది. మే 25 బుధవారం నాడు ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌(LSG)ను ఓడించింది. ఈ విజయంతో బెంగళూరుకు ఫైనల్‌కు అవకాశం దక్కగా, లక్నో ఇంటి ముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఆట హైలెట్‌గా నిలిచింది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఈడెన్ గార్డెన్స్‌లో సుమారు 60 వేల మంది ప్రేక్షకుల ముందు విధ్వంసం సృష్టించాడు. సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి గత సీజన్ వరకు రజత్ పాటిదార్ బెంగళూరులో భాగంగా ఉన్నాడు. కానీ మెగా వేలం కారణంగా అతన్ని రిటైన్ చేయలేదు. అప్పటికీ బెంగుళూరు లేదా మరేదైనా జట్టు అతనిపై వేలంలో కచ్చితంగా పందెం కాస్తుందని అనిపించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలంలో రెండు సార్లు వేలానికి వచ్చినా అతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు.

చివరిగా ఈ యువ బ్యాట్స్‌మెన్ లవ్‌నీత్ సిసోడియాను బెంగళూరు కొనుగోలు చేసింది. అతన్ని కేవలం 20 లక్షల బేస్‌ ప్రైస్‌తో దక్కించుకుంది. అయితే టోర్నమెంట్ మొదటి వారంలో అతను గాయపడి ఔట్ అయ్యాడు. పాటిదార్ బుధవారం ఆడిన ఇన్నింగ్స్‌ అతడి జీవితంలో మరిచిపోలేనిది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన తొలి RCB బ్యాట్స్‌మెన్ పటీదార్‌ రికార్డు సృష్టించాడు. అతను ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో 275 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 156 ఉండగా. అతను ఐపీఎల్‌ 2022లో 1 సెంచరీ, ఒక అర్ధ సెంచరీ చేశాడు.

ఇవి కూడా చదవండి