GT vs RR: చితక్కొట్టిన రాజస్థాన్‌.. గుజరాత్ పై 3 వికెట్ల తేడాతో విజయం

ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఈ పోరులో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

GT vs RR: చితక్కొట్టిన రాజస్థాన్‌.. గుజరాత్ పై 3 వికెట్ల తేడాతో విజయం
Gujarat

Edited By:

Updated on: Apr 17, 2023 | 6:25 AM

రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ మధ్య నేడు పోరు జరిగింది. ఈ సీజన్‌లోనూ ఇరు జట్లు పటిష్ట ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఈ పోరులో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచిన తర్వాత మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ట్రెంట్ బౌల్ట్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో, జాసన్ హోల్డర్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి నిష్క్రమించాడు. అయితే ఈరోజు విజయ్ శంకర్ గుజరాత్ టైటాన్స్‌లో ఆడలేదు. అభినవ్ మనోహర్ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

178 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శాంసన్‌, హెట్‌మయర్‌ అర్ధశతకాలతో చెలరేగి ఆడారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 13 బంతుల్లో శుభ్‌మన్‌ గిల్  45 పరుగులు 34 బంతుల్లో రాణించగా.. డేవిడ్‌ మిల్లర్  46పరుగులు 30 బంతుల్లో, అభినవ్ మనోహర్‌ 13 బంతుల్లో 27పరుగులు సాధించారు. ఇక రాజస్థాన్ టీమ్ లో సంజూ శాంసన్‌ 32 బంతుల్లో 60 పరుగులు, హెట్‌మయర్‌ 26 బంతుల్లో 56 సాధించి జట్టుకు విజయాన్ని అందించారు.