IPL 2026: కొత్త కెప్టెన్‌తో బరిలోకి రాజస్థాన్ రాయల్స్.. ఆ ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కే ఓటేసిన ఫ్రాంచైజీ..

Rajasthan Royals New Captain: సంజు సామ్సన్ ఐపీఎల్ 2025 (IPL 2025) వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ గత సీజన్ తర్వాత అతను ఫ్రాంచైజీ నుంచి నిష్క్రమించాడనే పుకార్లు వ్యాపించడం ప్రారంభించాయి. గత వేలానికి ముందు అతను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేయగానే ఇది ధృవీకరించబడింది. అప్పటి నుంచి పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని పుకార్లు వచ్చాయి.

IPL 2026: కొత్త కెప్టెన్‌తో బరిలోకి రాజస్థాన్ రాయల్స్.. ఆ ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కే ఓటేసిన ఫ్రాంచైజీ..
Rajasthan Royals

Updated on: Feb 13, 2026 | 6:55 PM

Rajasthan Royals New Captain: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, లీగ్ ప్రారంభ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ (RR), పూర్తిగా కొత్త లుక్ తో టోర్నమెంట్ లోకి అడుగుపెడుతోంది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ తన కొత్త కెప్టెన్ ని ప్రకటించింది. సంజు శాంసన్ ఫ్రాంచైజీ నుంచి నిష్క్రమించిన తర్వాత, యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కెప్టెన్ గా నియమితులయ్యాడు. అన్ని ఊహాగానాలు, వాదనలను ధృవీకరిస్తూ, రియాన్ ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహిస్తాడని రాయల్స్ అధికారికంగా ప్రకటించింది. రేసులో రియాన్ యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాతో సహా ఆరుగురు పోటీదారులను అధిగమించాడు.

ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. అస్సాంకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తారని మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, అదే జరిగింది. అయితే, రాజస్థాన్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేదంట. ఈ ప్రధాన నిర్ణయాన్ని తీసుకోవడానికి కఠినమైన ప్రక్రియను అనుసరించింది. ఫ్రాంచైజీ యజమాని మనోజ్ బాదాలే, క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర ఒక ప్రత్యేక వీడియోలో పేర్కొన్నారు.

రాయల్స్ సోషల్ మీడియా ఖాతాలలో 11 నిమిషాల వీడియో పోస్ట్ చేశారు. ఇందులో బాదాలే, సంగక్కర కెప్టెన్ ఎంపిక ప్రక్రియను వివరించారు. వీడియో సమయంలో, ఫ్రాంచైజ్ యజమాని బాదాలే తమ వద్ద ఏడుగురు పోటీదారులు ఉన్నారని, వారందరూ చాలా బలమైన పోటీదారులు అని వెల్లడించారు. వారందరినీ ఇంటర్వ్యూ చేసి వివిధ ప్రశ్నలు అడిగారు. ఈ అభ్యర్థులను తాను చాలా కఠినమైన ప్రశ్నలు అడిగానని, వారి దృక్పథాలను అర్థం చేసుకున్నానని సంగక్కర వివరించాడు. వారిలో ఎంతమంది ఏ స్థాయిలో కెప్టెన్‌గా ఉన్నారో కూడా అతను పరిగణనలోకి తీసుకున్నాడు.

ఆరుగురుని వదిలి కెప్టెన్ గా మారిన రియాన్..

గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లలో రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రియాన్ పరాగ్‌ను ఎంపిక చేశారు. దేశీయ క్రికెట్‌లో అస్సాం క్రికెట్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు. మిగిలిన ఆరుగురు పోటీదారులు ఎవరో ఆయన స్వయంగా వెల్లడించనప్పటికీ, అదే వీడియోలో, రియాన్ పరాగ్‌తో సహా ఏడుగురు ఆటగాళ్ల చిత్రాలను చూపించారు. వారిలో కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. వీరిలో, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, చెన్నై నుంచి ట్రేడ్ తర్వాత రాజస్థాన్‌కు తిరిగి వచ్చిన అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేర్లు ఉన్నాయి. వీరితో పాటు ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మైర్, జోఫ్రా ఆర్చ, సందీప్ శర్మ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు.

కెప్టెన్సీ గురించి రియాన్‌తో జైస్వాల్ ఏం చెప్పాడంటే..?

ఇదే వీడియోలో టీ20 ప్రపంచ కప్‌నకు ముందు ఇండియా A-USA ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తనకు తెలిసిందని ర్యాన్ వెల్లడించాడు. ఇంకా, పరాగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత అభినందించిన మొదటి వ్యక్తులలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ రేసులో పరాగ్‌తో పాటు జైస్వాల్ పోటీదారుడు. జైస్వాల్ నుంచి తనకు వచ్చిన సందేశాన్ని గుర్తుచేసుకుంటూ, “జైస్వాల్ మొదట ‘అభినందనలు, నా సోదరుడా, ఈసారి మనం గెలుస్తాం’ అని చెప్పాడు. జైస్వాల్, ధ్రువ్ నుంచి నేను వినాలనుకుంటున్నది అంతే.” ఇప్పుడు, కొత్త కెప్టెన్ రాక రాజస్థాన్ రాయల్స్‌కు 2008 తర్వాత మళ్లీ ఛాంపియన్లుగా మారడానికి అవసరమైన శక్తిని ఇస్తుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..