Bangladesh vs South Africa Test: బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా విజయంతో సిరీస్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఛటోగ్రామ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఇన్నింగ్స్ తొలి బంతికే 10 పరుగులు ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఇప్పుడు ఈ అరుదైన రికార్డు రబాడ ఖాతాలో చేరింది.
రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 575 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు షాద్‌మన్ ఇస్లాం, మహ్మద్ హసన్ జాయ్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఈ సమయంలో ఆఫ్రికా తరపున కగిసో రబాడ ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ చేసేందుకు రంగంలోకి దిగాడు. రబడ తన ఓవర్ తొలి బంతికే ఎలాంటి పరుగులు ఇవ్వలేదు. అయితే పిచ్ మధ్యలో సహచర ఆటగాడు సెనూరన్ ముత్తుసామి పరుగెత్తడంతో అంపైర్లు బంగ్లాదేశ్‌కు 5 పరుగులు పెనాల్టీగా ఇచ్చారు. దీంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 5 పరుగులతో ప్రారంభమైంది.
కానీ, రెండో బంతికే కగిసో రబడా తప్పిదంతో బంగ్లాదేశ్ జట్టుకు మళ్లీ 5 పరుగులు ఉచితంగా లభించాయి. ఈ ఓవర్‌లోని రెండో బంతిని రబాడ వైడ్‌గా వేశాడు. ఈ బంతి పిచ్‌కు దూరంగా పడిపోవడంతో వికెట్‌కీపర్ కూడా పట్టుకోలేకపోయాడు. అలా బంతి బౌండరీకి తాకింది. దీని నుంచి 4 పరుగులు బై రూపంలో రాగా, వైడ్ నుంచి 1 పరుగు లభించింది. తద్వారా ఈ బంతిలోనూ బంగ్లాదేశ్ జట్టు 5 పరుగులు చేయగా, 1 బంతికి 10 పరుగులు వారి ఖాతాలో చేరాయి. నిజానికి టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఎందుకంటే టెస్టు క్రికెట్‌లో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో తొలి బంతికి 10 పరుగులు చేయడం చాలా అరుదు.
Bangladesh started their innings with 10 runs on the board with no batter hitting a ball. 😄
– 5 runs through penalty, and 5 through No Ball + four form Rabada.pic.twitter.com/U3waKboV05
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2024
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా తమ ఎంపికకు న్యాయం చేసి 6 వికెట్లకు 575 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈసారి టోనీ డి జార్జి, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్డర్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. టోనీ డి జార్జి 269 బంతుల్లో 177 పరుగులు చేయగా, ట్రిస్టన్ స్టబ్స్ 106 పరుగులు చేశాడు. వియాన్ ముల్డర్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..