CSK vs LSG : సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్.. మ్యాచ్ వదిలేసి అక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అశ్విన్ ఫైర్

CSK vs LSG : ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే బౌలర్ అన్షుల్ కాంబోజ్ లాంటి వ్యక్తిని చూసిన అశ్విన్, సరదాగా ట్వీట్ చేస్తూ చేపాక్‌కు త్వరగా రమ్మని ఆటపట్టించారు. సరిగ్గా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో సీఎస్‌కే తలపడాల్సిన రోజునే ఈ ప్రమాణ స్వీకారం జరగడం విశేషం.

CSK vs LSG :  సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్.. మ్యాచ్ వదిలేసి అక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అశ్విన్ ఫైర్
Csk

Updated on: May 11, 2026 | 11:33 AM

CSK vs LSG : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో స్పందించే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మరోసారి నెటిజన్లను కడుపుబ్బ నవ్వించాడు. తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్న వేళ, అటు రాజకీయాలను ఇటు క్రికెట్‌ను ముడిపెడుతూ అశ్విన్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అశ్విన్ పసిగట్టాడు.

సీఎం పక్కన అన్షుల్ కాంబోజ్?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, సూపర్ స్టార్ విజయ్.. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకను టీవీలో చూస్తున్న అశ్విన్‌కు ఒక వింత దృశ్యం కనిపించింది. విజయ్ పక్కన ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు అచ్చం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేసర్ అన్షుల్ కాంబోజ్‌లా ఉన్నాడు. ఇంకేముంది, సమయం కోసం చూస్తున్న అశ్విన్ వెంటనే రంగంలోకి దిగిపోయాడు.

క్యాబ్ ఎక్కి చేపాక్‌కు వచ్చేయ్

సరిగ్గా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో సీఎస్‌కే తలపడాల్సిన రోజునే ఈ ప్రమాణ స్వీకారం జరగడం విశేషం. ఆ సెక్యూరిటీ గార్డు ఫోటోను షేర్ చేస్తూ అశ్విన్ ఎక్స్‌లో ఇలా రాశాడు.. “డ్యూటీ ముఖ్యం అని తెలుసు, కానీ ఇవాళ మనకు మస్ట్ విన్ మ్యాచ్. అది కూడా డే గేమ్! కాబట్టి కాంబోజ్.. త్వరగా ఒక క్యాబ్ ఎక్కి చేపాక్ స్టేడియానికి వచ్చేయ్. ఇవాళ పెద్ద మ్యాచ్ ఉంది” అంటూ సరదాగా ఆటపట్టించాడు. నిజానికి కాంబోజ్ ఈ సీజన్‌లో 18 వికెట్లతో సీఎస్‌కే అత్యుత్తమ బౌలర్‌గా రాణిస్తున్నాడు.

ధోనీ లేని లోటు తీరుస్తున్న సంజూ

ఐపీఎల్ 2026లో చెన్నై ప్రస్థానం ఒడిదుడుకులతో సాగుతోంది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో కుంగిపోయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. గాయం కారణంగా ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా సంజూ శామ్సన్ ఆ లోటును అద్భుతంగా తీరుస్తున్నాడు. ఇప్పటికే సంజూ ఈ సీజన్‌లో రెండు సెంచరీలు బాది ఫామ్‌లో ఉన్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us