Prathika Rawal : న్యూజిలాండ్‌ను వణికించిన ప్రతీక రావల్ .. ప్రపంచ కప్‌లో తొలి సెంచరీతో పాటు మరో రికార్డ్

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్‌లో ఒక కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. యువ ఓపెనర్ ప్రతీక రావల్ న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించింది. ఇది ఆమె వన్డే కెరీర్‌లో రెండో సెంచరీ కాగా, ఈ వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన కూడా సెంచరీ చేయడంతో, మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారిగా రికార్డు అయింది.

Prathika Rawal : న్యూజిలాండ్‌ను వణికించిన ప్రతీక రావల్ .. ప్రపంచ కప్‌లో తొలి సెంచరీతో పాటు మరో రికార్డ్
Pratika Rawal

Updated on: Oct 23, 2025 | 6:53 PM

Prathika Rawal : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్‌లో ఒక కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. యువ ఓపెనర్ ప్రతీక రావల్ న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించింది. ఇది ఆమె వన్డే కెరీర్‌లో రెండో సెంచరీ కాగా, ఈ వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన కూడా సెంచరీ చేయడంతో, మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారిగా రికార్డు అయింది. తన సెంచరీతో పాటు, ప్రతీక అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో యువ ఓపెనర్ ప్రతీక రావల్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఢిల్లీకి చెందిన ఈ యంగ్ బ్యాటర్, తన 23వ వన్డే ఇన్నింగ్స్‌లో 120 బంతులు ఎదుర్కొని తన కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేసింది. ఈ టోర్నమెంట్‌లో రెండవసారి 50 పరుగుల మార్కును దాటిన ప్రతీక, ఈసారి దాన్ని సెంచరీగా మలచడంలో సఫలమైంది.

ఈ మ్యాచ్‌లో ప్రతీక, సీనియర్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మంధాన సెంచరీ తర్వాత అవుట్ అయినా, ప్రతీక తన సెంచరీని పూర్తి చేసుకుని జట్టుకు మంచి స్కోరు అందించడంలో కీలకమైంది. ప్రతీక సెంచరీ చేయడంతో భారత క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డు నమోదైంది.

మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. కానీ, భారత్ తరఫున ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి. మంధాన, ప్రతీక ఈ అరుదైన ఘనతను సాధించారు. సెంచరీతో పాటు, ప్రతీక తన వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది.

ప్రతీక రావల్ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే 1000 వన్డే పరుగులు పూర్తి చేసింది. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ లిండ్సే రీలర్ పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును ప్రతీక సమం చేసింది. ఈ యువ బ్యాటర్ రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..