IPL 2023: మొదటి వేలంలో రూ. 10 లక్షలు.. కట్‌చేస్తే.. నేడు కోట్లకు పడగలెత్తిన ఆరుగురు యువ భారత ప్లేయర్లు..

|

Apr 01, 2023 | 2:45 PM

సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ సహా కొంతమంది భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో రూ. 8 నుంచి రూ.10 లక్షల మధ్య ప్రారంభించారు. నేడు వారి జీతం రూ.10 కోట్లకుపైగానే ఉంది.

1 / 7
ఐపీఎల్ 2023 సందడి ప్రారంభమైంది. ఇక అందరి చూపు ఈ ఇండియన్ రిచ్ లీగ్‌పైనే నిలిచింది. ఈ క్రమంలో ఓ ఆరుగురు టీమిండియా ప్లేయర్ల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే.. వీరు తొలిసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కేవలం రూ.10లక్షలతోనే తమ కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం వీరిలో కొందరు రూ.17 లక్షలకు కూడా అందుకుంటున్నారు. వారెవరో ఓసారి చూద్దాం..

2 / 7
కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి 10 లక్షల రూపాయలకు ప్రారంభించాడు. నేడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఏడాదికి రూ.17 కోట్లు సంపాదిస్తున్నాడు.

3 / 7
2008లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ తరపున 10 లక్షల రూపాయలతో IPLలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున కీలక ప్లేయర్‌గా మారాడు. జడేజా జీతం రూ.16 కోట్లుగా ఉంది.

4 / 7
ఇషాన్ కిషన్ 2016లో గుజరాత్ లయన్స్ తరపున అరంగేట్రం చేశాడు. అప్పట్లో గుజరాత్‌ రూ. 35 లక్షలకు కొనుగోలు చేయగా, ఇప్పుడు ముంబై తరపున రూ. 15.2 కోట్లు అందుకుంటున్నాడు.

5 / 7
హార్దిక్ పాండ్యా ధర కూడా చాలా వేగంగా పెరిగింది. 2015లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పాండ్యా.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. పాండ్యా ప్రస్తుతం రూ. 15 కోట్లు అందుకుంటున్నాడు. అరంగేట్రం సీజన్‌లోనే పాండ్యా గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.

6 / 7
సంజూ శాంసన్ 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో అతని ధర కేవలం రూ. 8 లక్షలు మాత్రమే. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కమాండ్ శాంసన్ చేతుల్లో ఉంది. ఈ యంగ్ క్రికెటర్ జీతం రూ.14 కోట్లుగా నిలిచింది.

7 / 7
సూర్యకుమార్ యాదవ్ జీతం కూడా బాగా పెరిగింది. 2011లో రూ.10 లక్షలతో ప్రారంభించిన టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్.. నేడు రూ.8 కోట్లకు చేరుకున్నారు.