Phill Salt: అదరగొట్టిన సాల్ట్.. హండ్రెడ్ లీగ్‌లో ఆ ఘనత సాధించిన ఫస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్..

100 బాల్స్ టోర్నమెంట్ ది హండ్రెడ్ లీగ్ ప్రారంభమై మూడేళ్లు గడిచింది. ఇప్పుడు దాని నాల్గవ సీజన్‌ నడుస్తోంది. ఈ సీజన్‌లో బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ కొత్త చరిత్ర సృష్టించాడు. వెయ్యి పరుగులు పూర్తి చేసిన నెంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచాడు.

Phill Salt: అదరగొట్టిన సాల్ట్.. హండ్రెడ్ లీగ్‌లో ఆ ఘనత సాధించిన ఫస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్..
Phill Salt

Updated on: Aug 10, 2025 | 4:17 PM

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఫిల్ సాల్ట్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లోని ఐదవ మ్యాచ్‌తో సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ది హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లోని 5వ మ్యాచ్‌లో.. ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్లు ఒకదానికొకటి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో.. ఓవల్ ఇన్విన్సిబుల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుకు ఫిల్ సాల్ట్ అదిరే ఆరంభాన్ని అందించాడు.

ఓపెనర్‌గా వచ్చిన ఫిల్ సాల్ట్ కేవలం 32 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 41 పరుగులు చేశాడు. 41 పరుగుల, ఫిల్ సాల్ట్ ది హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీనికి ముందు ఈ రికార్డు సదరన్ బ్రేవ్ కెప్టెన్ జేమ్స్ విన్స్ పేరిట ఉండేది. ఫిల్ సాల్ట్ ఇప్పుడు జేమ్స్ విన్స్‌ను అధిగమించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ది హండ్రెడ్ లీగ్‌లో ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ 7 హాఫ్ సెంచరీలతో మొత్తం 1036 పరుగులు చేశాడు. దీంతో అతను ది హండ్రెడ్ లీగ్‌లో వెయ్యి పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఫిల్ సాల్ట్ అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మాంచెస్టర్ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ 57 బంతుల్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సాల్ట్ రికార్డ్ మాత్ర స్పెషల్ అని చెప్పాలి. అయితే ఓవల్ ఇన్విన్సిబుల్స్ రెండింటికి రెండు మ్యాచులు గెలిచి.. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. మాంచెస్టర్ రెండింటికి రెండూ ఓడిపోయి చివరి స్థానంలో ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..