PSL 2026: హైదరాబాద్ టీమ్ ఇక పాకిస్థాన్‌లోనూ.. ఆ ఇద్దరు ఐపీఎల్ స్టార్ల జీతంతోనే కొనేసిన ‘యూఎస్ కావ్యపాప’!

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో గురువారం జరిగిన టీ20 ఫ్రాంచైజీ ఈవెంట్‌లో రెండు కొత్త జట్లు చోటు దక్కించుకున్నాయి. ఇప్పటివరకు ఆరు జట్లు ఉన్నాయి. గురువారం నాడు PSLలో రెండు కొత్త టీ20 ఫ్రాంచైజీల కోసం ఒక రియల్ ఎస్టేట్ కన్సార్టియం, యూఎస్ ఆధారిత విమానయాన, ఆరోగ్య సంరక్షణ సమ్మేళనం $12.75 మిలియన్లకు (సుమారు INR 114 కోట్లు) బిడ్‌లను గెలుచుకున్నాయి. OZ డెవలపర్స్ సియాల్‌కోట్‌ను దాని కొత్త ఫ్రాంచైజీగా పేర్కొంది.

PSL 2026: హైదరాబాద్ టీమ్ ఇక పాకిస్థాన్‌లోనూ.. ఆ ఇద్దరు ఐపీఎల్ స్టార్ల జీతంతోనే కొనేసిన యూఎస్ కావ్యపాప!
Psl Hyderabad Team

Updated on: Jan 09, 2026 | 11:13 AM

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ఆరు జట్లతో సాగిన ఈ లీగ్, ఇకపై ఎనిమిది జట్లతో అలరించనుంది. అయితే, తాజాగా వేలంలో అమ్ముడైన ‘హైదరాబాద్’ ఫ్రాంచైజీ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జట్టు ధర మన భారతీయ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ల ఐపీఎల్ జీతంతో సమానంగా ఉండటం విశేషం.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ ప్రతిష్టాత్మక టీ20 లీగ్ అయిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను మరింత విస్తరించింది. గురువారం జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో రెండు కొత్త జట్లను లీగ్‌లో చేర్చింది. అమెరికాకు చెందిన ఏవియేషన్, హెల్త్‌కేర్ సంస్థ అలాగే ఒక రియల్ ఎస్టేట్ కన్సార్టియం ఈ జట్లను దక్కించుకున్నాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ జట్టు ధర ఎంత?

అమెరికాకు చెందిన ఎఫ్.కె.ఎస్ (FKS) గ్రూప్ ‘హైదరాబాద్’ ఫ్రాంచైజీని సుమారు 6.2 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 55.57 కోట్లు) దక్కించుకుంది. మరోవైపు ‘సియాల్‌కోట్’ జట్టును ఓజడ్ (OZ) డెవలపర్స్ అనే సంస్థ రూ. 58.38 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రెండు జట్ల రాకతో పీఎస్ఎల్ మార్చి 26 నుంచి ఎనిమిది జట్లతో ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: టీ20ల్లో విధ్వంసం అంటే ఇదే.. 38 సిక్సర్లు, 53 ఫోర్లు.. 549 పరుగులతో అన్ బ్రేకబుల్ రికార్డ్..

ఐపీఎల్ జీతాలతో పోలిక..

ఈ వేలం ప్రక్రియలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పీఎస్ఎల్ హైదరాబాద్ జట్టు మొత్తం ధర, ఐపీఎల్ 2026లో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పొందుతున్న జీతాల మొత్తానికి ఇంచుమించు సమానంగా ఉంది.

రిషబ్ పంత్ ఐపీఎల్ ధర: రూ. 27 కోట్లు

శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ధర: రూ. 26.75 కోట్లు

వీరిద్దరి మొత్తం జీతం రూ. 53.75 కోట్లు కాగా, పీఎస్ఎల్ హైదరాబాద్ జట్టు ధర ₹55.57 కోట్లు. అంటే మన ఇద్దరు టాప్ ప్లేయర్ల జీతంతో పాకిస్థాన్ లీగ్‌లో ఒక పూర్తి జట్టునే కొనేయొచ్చన్న మాట.

Video: 38 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 13 ఫిఫ్టీలు.. ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?

ఇంకా చెప్పాలంటే, ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 9 ప్లేయర్ల మొత్తం జీతం (సుమారు రూ. 118 కోట్లు), పీఎస్ఎల్‌లో చేరిన ఈ రెండు కొత్త జట్ల మొత్తం ధర కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ముల్తాన్ సుల్తాన్స్ పరిస్థితి: గతంలో వివాదాల కారణంగా యాజమాన్యం నుంచి బోర్డు చేతికి వచ్చిన ‘ముల్తాన్ సుల్తాన్స్’ జట్టును ఈ ఏడాది పీఎస్ఎల్ బోర్డే నిర్వహించనుంది. ఏప్రిల్‌లో లీగ్ ముగిసిన తర్వాత ఈ జట్టును కూడా వేలానికి ఉంచనున్నారు.

మొత్తానికి, ఒకవైపు ఐపీఎల్ ప్లేయర్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు పీఎస్ఎల్ తన లీగ్‌ను విస్తరించే ప్రయత్నంలో బిజీగా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..