PBKS vs RCB: ఆర్‌సీబీ బౌలర్ల దూకుడు.. 101 పరుగులకే పంజాబ్ ఆలౌట్..

IPL 2025 క్వాలిఫైయర్-1 న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ 141 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయ్యారు. 

PBKS vs RCB: ఆర్‌సీబీ బౌలర్ల దూకుడు.. 101 పరుగులకే పంజాబ్ ఆలౌట్..
Ipl 2025, Rcb Vs Pbks

Updated on: May 29, 2025 | 9:03 PM

IPL 2025 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 101 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 14.1 ఓవర్లలో 101 పరుగులకు పంజాబ్‌ను ఆలౌట్ చేసింది. ఇది ప్లేఆఫ్స్‌లో అత్యల్ప స్కోరుకు సమానం. అంతకుముందు 2023లో లక్నో జట్టు ముంబైపై 101 పరుగులు మాత్రమే చేసింది.

బెంగళూరు తరఫున జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. పంజాబ్ జట్టులో మార్కస్ స్టోయినిస్ (26 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఉమర్‌జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జమీసన్ మరియు అర్ష్‌దీప్ సింగ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ మరియు సుయాష్ శర్మ.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..