PBKS vs DC, IPL 2022: ఐపీఎల్ 15లో భాగంగా 64వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడుతున్నాయి. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్‌లో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 48 బంతుల్లో 63 పరుగులు బాదేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఈ రెండు జట్లూ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ ఇద్దరికీ కీలకమైనది. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో 12 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గరిష్టంగా 14 పాయింట్లను చేరుకోగలదు. అప్పుడు ప్లేఆఫ్‌కు మార్గం ఇతర జట్లపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు పంజాబ్ గురించి మాట్లాడితే, ఈ జట్టు స్థానం కూడా ఢిల్లీని పోలి ఉంటుంది. కానీ, నెట్ రన్ రేట్ పరంగా, పంజాబ్ కంటే ఢిల్లీ వెనుకంజలోనే ఉంది.
జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ఖాయమని, ఓడిన జట్టుకు ప్లేఆఫ్‌కు చేరుకోవడం కష్టతరంగా మారనుంది.
ఢిల్లీ, పంజాబ్‌లు ఇప్పటి వరకు చెరో 12 మ్యాచ్‌లు ఆడగా ఇరు జట్లూ 12 పాయింట్లతో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే ఇరుజట్లు తప్పక గెలవాల్సిందే.
పంజాబ్ పై 17 పరుగుల తేడా తో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఢిల్లీ 159/7, పంజాబ్ 142/9
తొమ్మిదో వికెట్ కోల్పోయిన పంజాబ్.. రబడా అవుట్ ..131/9
ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్.. స్కోర్ 123/8 .. జితేష్ శర్మ (44)వికెట్ కోల్పోయిన పంజాబ్
విజయం కోసం పోరాడుతుంది పంజాబ్.. 22 బాల్స్ కు 51 పరుగులు చేయాల్సి ఉంది. 16.3 ఓవర్లుకు 113/7
100 పరుగులకు చేరిన పంజాబ్ స్కోర్.. 14.5 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 100/7
వరుస వికెట్లు కోల్పోతున్న పంజాబ్.. రిషి ధావన్ అవుట్.. 13 ఓవర్లకు 82/7
రాణిస్తున్న ఢిల్లీ .. వరుస వికెట్లు కోల్పోతున్న పంజాబ్.. 67/6 వికెట్లు కోల్పోయిన పంజాబ్
లివింగ్ స్టోన్ అవుట్ అయ్యాడు.. దీంతో 5 వికెట్స్ కోల్పోయిన పంజాబ్ ఎనిమిది ఓవర్లకు.. 64/5
ఫోర్ కొట్టి ఆదుకున్న జితేష్ శర్మ.. 7.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 60కు చేరింది..
పీకల్లోతు కష్టాల్లో పంజాబ్ .. మయాంక్ అగర్వాల్ అవుట్.. స్కోర్ 55/4
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ .. శిఖర్ ధావన్ అవుట్ అవ్వడంతో స్కోర్ 54/3
6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 3 వికెట్లు నష్టపోకుండా 54 పరుగులు చేసింది. ధావన్ 19, లివింగ్ స్టోన్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
మార్ష్ (63) రూపంలో ఢిల్లీ టీం 6వ వికెట్‌ను కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం ఢిల్లీ టీం 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
17 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 53, అక్షర్ పటేల్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పొవెల్ (2) రూపంలో ఢిల్లీ టీం 5వ వికెట్‌ను కోల్పోయింది. లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం ఢిల్లీ టీం 14 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.
రిషబ్ పంత్(7) రూపంలో ఢిల్లీ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. లివింగ స్టోన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం ఢిల్లీ టీం 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
లలిత్ యాదవ్(24 పరుగులు, 21 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో రాజపక్సేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
8 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. లలిత్ యాదవ్ 12, మిచెల్ మార్ష్ 29 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
4 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 26, మిచెల్ మార్ష్ 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
తొలి ఓవర్ తొలి బంతికి పంజాబ్ బౌలర్ లియామ్ లివింగ్ స్టోన్ ఢిల్లీ టీంకు భారీ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద
కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ టీం, తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ రెండు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగగా ఇందులో పంజాబ్ 15 మ్యాచ్‌లు గెలుపొందగా, ఢిల్లీ 14 మ్యాచ్‌లు గెలిచింది. అంటే, పంజాబ్ కేవలం ఒక మ్యాచ్ తేడాతో ఆధిపత్యం చెలాయిస్తోంది.
ఈ సీజన్‌లో ఈ రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్. అంతకుముందు ఏప్రిల్ 20న ఇరు జట్లు తలపడగా, అందులో ఢిల్లీ జట్టు విజయం సాధించింది.
IPL-2022లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈరోజు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలవడం రెండు జట్లకు కీలకం. ఓడిపోతే ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు ఇతర జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పరంగా పంజాబ్ జట్టు వెనుకంజలో నిలిచింది.