PBKS vs DC Score: హాఫ్ సెంచరీతో మార్ష్ కీలక ఇన్నింగ్స్.. స్వల్ప స్కోర్‌కే ఢిల్లీ పరిమితం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

|

May 16, 2022 | 9:24 PM

Punjab Kings vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

PBKS vs DC Score: హాఫ్ సెంచరీతో మార్ష్ కీలక ఇన్నింగ్స్.. స్వల్ప స్కోర్‌కే ఢిల్లీ పరిమితం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
Punjab Kings Vs Delhi Capitals
Follow us on

ఐపీఎల్ 15లో భాగంగా 64వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడుతున్నాయి. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్‌లో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 48 బంతుల్లో 63 పరుగులు బాదేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులు(16 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), లలిత్ యాదవ్ 24లతో ఆకట్టుకున్నారు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతగా రాణించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో లియాం లివింగ్ స్టోన్ 3 వికెట్లు, రబాడ 1 వికెట్, అర్షదీప్ 3 వికెట్లు, పడగొట్టారు.

ఈ సీజన్‌లో పంత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు..

పంజాబ్‌పై కూడా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. 3 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతన్ని లియామ్ లివింగ్‌స్టోన్ బాధితుడిగా మార్చాడు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో పంత్ 7, 13, 21, 26, 44 పరుగులు చేశాడు. పంత్ ఔట్ అయిన తర్వాత రోవ్‌మన్ పావెల్ కూడా తొందరగానే ఔటయ్యాడు. అతని బ్యాట్‌ నుంచి 6 బంతుల్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి.

తొలి బంతికే వార్నర్ ఔట్..

ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ఢిల్లీ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే డేవిడ్‌ వార్నర్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. అతని వికెట్‌ను లియామ్ లివింగ్‌స్టోన్ తీశాడు. ఐపీఎల్‌ చరిత్రలో 8 ఏళ్ల తర్వాత వార్నర్‌ గోల్డెన్‌ డక్‌తో అవుటయ్యాడు. అదే సమయంలో, అతను అవుట్ అయిన తర్వాత, సర్ఫరాజ్ ఖాన్ వేగంగా బ్యాటింగ్ చేసి కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 5 ఫోర్లు, ఒక సిక్స్ వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ 200గా నిలిచింది. అర్ష్‌దీప్ సింగ్ సర్ఫరాజ్ వికెట్ తీశాడు.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Also Read: IPL 2022: కోహ్లీ, రోహిత్ పేలవ ఫామ్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

PBKS vs DC Live Score, IPL 2022: హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న మార్ష్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?