ఎగిరొచ్చి ..బాల్ ఇచ్చిన ప్యారాచ్యూట్ టీమ్ !

లండన్లోని లార్డ్స్ మైదానంలో ఆదివారం న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా అద్భుతం జరిగింది. బ్రిటిష్ ఆర్మీలోని రెడ్ డెవిల్స్ కు చెందిన పారాచ్యూట్ రెజిమెంట్ సభ్యులు… అఫీషియల్ మ్యాచ్ బాల్ ని ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి మైదానంలోని అంపైర్లకు అందించారు. ఒకరి తరువాత వీరు పారాచ్యూట్ నుంచి సినీ ఫక్కీలో కిందికి దిగడం చూసి అంతా చప్పట్లు కొడుతూ హర్షాతిరేకంతో కేకలు పెట్టారు. వీళ్ళు ఫైనల్ వెన్యూకు చేరుకుంటున్నవైనం తాలూకు వీడియో వైరల్ అవుతోంది. గతంలో […]

ఎగిరొచ్చి ..బాల్  ఇచ్చిన ప్యారాచ్యూట్ టీమ్ !
Follow us

|

Updated on: Jul 14, 2019 | 5:29 PM

లండన్లోని లార్డ్స్ మైదానంలో ఆదివారం న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా అద్భుతం జరిగింది. బ్రిటిష్ ఆర్మీలోని రెడ్ డెవిల్స్ కు చెందిన పారాచ్యూట్ రెజిమెంట్ సభ్యులు… అఫీషియల్ మ్యాచ్ బాల్ ని ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి మైదానంలోని అంపైర్లకు అందించారు. ఒకరి తరువాత వీరు పారాచ్యూట్ నుంచి సినీ ఫక్కీలో కిందికి దిగడం చూసి అంతా చప్పట్లు కొడుతూ హర్షాతిరేకంతో కేకలు పెట్టారు. వీళ్ళు ఫైనల్ వెన్యూకు చేరుకుంటున్నవైనం తాలూకు వీడియో వైరల్ అవుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వినూత్న ప్రయోగం జరగలేదు. బహుశా ఇది వాల్డ్ కప్ ఫైనల్ గనుక నిర్వాహకులు ఈ ‘ పారాచ్యూట్ ‘ ఎక్స్ పెరిమెంట్ కు పూనుకొన్నట్టు తెలుస్తోంది.