Naseem Shah: మళ్లీ పరువు పొగొట్టుకున్న పాక్‌ క్రికెటర్‌.. ట్రోల్‌ చేస్తూ తెగ ఆడేసుకుంటోన్న ఫ్యాన్స్‌.. కారణమిదే

|

Feb 17, 2023 | 6:30 PM

చాలామంది ఆటగాళ్లు తెలియకుండానే నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. ఇంకొందరు భావోద్వేగాలు కంట్రోల్‌ చేసుకోలేక నియమాలను కాలరాస్తుంటారు. అయితే తాజాగా ఓ పాక్‌ క్రికెటర్‌ నిబంధనలు ఉల్లంఘించిన తీరు మాత్రం చాలా వెరైటీగా ఉంది. అంతుకుమించి సిల్లీగా ఉంది.

Naseem Shah: మళ్లీ పరువు పొగొట్టుకున్న పాక్‌ క్రికెటర్‌.. ట్రోల్‌ చేస్తూ తెగ ఆడేసుకుంటోన్న ఫ్యాన్స్‌.. కారణమిదే
Naseem Shah
Follow us on

క్రికెట్‌తో సహా ఏ ఆటను తీసుకున్నా నిబంధనలు ఉల్లంఘించిన ప్లేయర్లకు మ్యాచ్‌ ఫీజులో కోత విధించడమో లేదా కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించడమో జరుగుతుంది. అందుకే ఆటలో నిబంధనలు, నియమాల పట్ల ఆటగాళ్లకు తగిన అవగాహన ఉండాలి. అయితే చాలామంది ఆటగాళ్లు తెలియకుండానే నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. ఇంకొందరు భావోద్వేగాలు కంట్రోల్‌ చేసుకోలేక నియమాలను కాలరాస్తుంటారు. అయితే తాజాగా ఓ పాక్‌ క్రికెటర్‌ నిబంధనలు ఉల్లంఘించిన తీరు మాత్రం చాలా వెరైటీగా ఉంది. అంతుకుమించి సిల్లీగా ఉంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌) జరుగుతుంది. ఈ లీగ్ లో భాగంగా తాజాగా క్వెటా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్‌లో గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పాక్‌ యంగ్ బౌలర్‌ నసీమ్ షా. గత కొన్ని రోజులుగా తన ఓవరాక్షన్‌తో ట్రోలింగ్‌కు గురవుతోన్న ఈ యంగ్ సెన్సేషన్‌ ఈ మ్యాచ్‌లోనూ నిబంధనలు ఉల్లంఘించి తన పరువు పోగొట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు వచ్చిన నషీమ్ షా ధరించిన హెల్మెట్ అతడిని చిక్కుల్లో పడేసింది. పాకిస్థాన్ లీగ్ ఆడుతున్న నసీమ్ షా.. హెల్మెట్ మాత్రం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ ది ధరించాడు. దీంతో పాక్ క్రికెట్ బోర్డ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అయ్యింది. అందుకే అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు.

నసీమ్‌ షా బంగ్లా ప్రీమియర్ లీగ్ లో కోమిల్లా విక్టోరియా ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే అదే బ్యాగ్ ను తన వెంట తెచ్చుకున్న పాక్‌ బౌలర్‌ అదే బీపీఎల్‌ హెల్మెట్ ను ధరించి బరిలోకి దిగాడు. ప్రస్తుతం నసీమ్ షా బీపీఎల్ హెల్మెట్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు పాక్ ఆటగాడిని ఓ ఆటాడుకుంటున్నారు. ఈ మాత్రం నిబంధనలు కూడా తెలీదా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..