Video: ఇదెక్కడి తొండి గేమ్.. టాస్‌లో టీమిండియాను మోసం చేసిన పాక్ కెప్టెన్.. ఏం చేసిందంటే?

India Women vs Pakistan Women Toss Controversy: భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో, ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకుంటారో లేదో చూడాలని అందరి దృష్టి టాస్ పైనే ఉంది. హర్మన్‌ప్రీత్, ఫాతిమా కరచాలనం చేసుకోలేదు. కానీ మ్యాచ్ సమయంలో, పాకిస్తాన్ కెప్టెన్ మౌనంగా ఉండి, ఓ తప్పును కప్పిపుచ్చడంతో టీమిండియాకు అన్యాయం చేసింది.

Video: ఇదెక్కడి తొండి గేమ్.. టాస్‌లో టీమిండియాను మోసం చేసిన పాక్ కెప్టెన్.. ఏం చేసిందంటే?
Indw Vs Pakw Toss Update

Updated on: Oct 05, 2025 | 5:15 PM

India Women vs Pakistan Women Toss Controversy: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మైదానంలో వివాదాల పరంపర ఆగే సూచనలు కనిపించడం లేదు. పురుషుల ఆసియా కప్ 2025 సమయంలో, రెండు జట్లు మూడుసార్లు ఘర్షణ పడ్డాయి. ప్రతిసారీ ఏదో ఒక రకమైన వివాదం చెలరేగింది. ఇప్పుడు ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో కూడా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా వివాదం చెలరేగింది. టాస్ సమయంలో మరోసారి వివాదం చెలరేగింది. ఇక్కడ ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేయకపోవడమే కాకుండా, టీం ఇండియాకు ఓ అన్యాయం జరిగింది. టాస్ ఓడిపోయినప్పటికీ, పాకిస్తాన్ కెప్టెన్‌ను విజేతగా ప్రకటించారు.

అక్టోబర్ 5వ తేదీ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఆరో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా కరచాలనం చేస్తారా లేదా అని అందరి దృష్టి ఉంది. పురుషుల ఆసియా కప్‌లో చూసినట్లుగా, ఇక్కడ కూడా అదే జరిగింది. టాస్ సమయంలో భారత, పాకిస్తాన్ కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు, చూపులు మార్చుకోలేదు, మాట్లాడుకోవడం కూడా చేయలేదు.

టాస్ వేసే సమయంలో..

కానీ, ఇదంతా జరుగుతున్న సమయంలో భారత జట్టు మోసపోవడం గమనార్హం. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాణెం విసిరిన వెంటనే, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టెయిల్స్ అని పిలిచింది. అక్కడే ఆట మొత్తం జరిగింది. ఫాతిమా టెయిల్స్ అని పిలిచింది. కానీ, అక్కడే ఉన్న మ్యాచ్ రిఫరీ శాండ్రే ఫ్రిట్జ్, సనా హెడ్స్ అని పిలిచిందంటూ చెప్పడం గమనార్హం. కాయిన్ పడిన వెంటనే, ఫలితం హెడ్స్ అని వచ్చింది. రిఫరీ పాకిస్తాన్‌ను టాస్ విజేతగా ప్రకటించాడు.

పాక్ కెప్టెన్ మౌనం..

దీని అర్థం సనా ఫాతిమా తన పిలుపు ఆధారంగా టాస్ కోల్పోయింది. అయితే, మ్యాచ్ రిఫరీ, టాస్ ప్రెజెంటర్ మెల్ జోన్స్, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ యాదవ్ ఆ తప్పును పట్టించుకోలేదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తాను టెయిల్స్‌కు కాల్ చేశానని తెలిసినప్పటికీ పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడకపోవడం గమనార్హం. ఆమె నిజాయితీగా ఉంటే, తాను టెయిల్స్‌కు కాల్ చేశానని రిఫరీకి చెబితే, టాస్‌ను కోల్పోయేది. కానీ ఆమె నిశ్శబ్దంగా ముందుకు వెళ్లి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..