
కొలంబోలో భారత్‌తో జరిగిన మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు చెందిన సిద్రా అమీన్ ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సోమవారం దోషిగా నిర్ధారించింది. ‘అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఫిక్చర్లు, ఫిట్టింగులను దుర్వినియోగం చేయడం’ అనే కోడ్‌లోని ఆర్టికల్ 2.2ను అమీన్ ఉల్లంఘించినట్లు ఐసిసి పేర్కొంది.
పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 40వ ఓవర్లో పాక్ బ్యాటర్ సిద్రా అమీన్ అవుట్ అయిన తర్వాత పిచ్‌ను తన బ్యాట్‌తో బలంగా కొట్టింది. అప్పటికే 81 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడిన అమీన్ అవుట్ అయిన అసహనంతో కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. దీంతో ఐసీసీ సరైన విధంగా బుద్ధి చెప్పింది. కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. భారత్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ విఫలమైంది. పాకిస్తాన్ కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కాగా అమీన్ చేసిన ఓవర్ యాక్షన్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించబడతాయి. అమీన్‌పై ఆన్-ఫీల్డ్ అంపైర్లు లారెన్ అగెన్‌బాగ్, నిమాలి పెరెరా, థర్డ్ అంపైర్ కెర్రిన్ క్లాస్టే, ఫోర్త్ అంపైర్ కిమ్ కాటన్ అభియోగాలు మోపారు. మరోవూపు సిద్రా కూగా తన తప్పును అంగీకరించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి