
కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. మరో 5 పరుగులు జోడించి.. కివీస్ జట్టును పెవిలియన్ చేర్చాలనుకున్న పాకిస్తాన్ జట్టు ఆశలపై ఓ న్యూజిలాండ్ ప్లేయర్ నీళ్లు చల్లాడు. పాక్ బౌలర్ల భరతం పట్టాడు. మైదానానికి అన్ని వైపులా బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ 10వ నెంబర్ ఆటగాడు మాట్ హెన్రీ(68) అర్ధ సెంచరీతో అదరగొట్టి అజేయంగా నిలవగా.. నెంబర్ 11 బ్యాటర్ ఎజాజ్ పటేల్(35) అతడికి మంచి సహకారాన్ని అందించి 10వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది పాకిస్తాన్‌లో 10వ వికెట్‌కు విదేశీ జట్టు నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం.
ఈ మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ 68 పరుగులు చేసి.. చివరి వరకు అజేయంగా నిలవగా.. ఎజాజ్ పటేల్ 35 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. వారిద్దరికీ ఇదే టెస్టుల్లో అత్యుత్తమ స్కోర్. 9 వికెట్లకు న్యూజిలాండ్ 345 పరుగులు చేయగా.. 10 వికెట్‌కు వీరిద్దరి సెంచరీ భాగస్వామ్యం కారణంగా చివరికి 449 పరుగులకు ఆలౌట్ అయింది.
న్యూజిలాండ్ జట్టు 345 పరుగులకే పాకిస్థాన్ 9 వికెట్లు కోల్పోయింది. అయితే 10వ వికెట్‌కు భాగస్వామ్య ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేయగలిగింది. విదేశీ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో 10వ వికెట్‌కు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు జోడించడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 11వ సారి. అంతేకాదు న్యూజిలాండ్ జట్టు ఈ ఘనత మూడోసారి సాధించింది. అయితే 2013లో చేసిన 163 పరుగుల ప్రపంచ రికార్డు మాత్రం చెరిగిపోలేదు.