గాలె టెస్టులో విజయం సాధించాలని పాక్(Pakistan Vs Sri Lanka) జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఆ జట్టు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(Imam ul Haq) తన ఇన్నింగ్స్‌లో అజాగ్రత్తగా వ్యవహరించడంతో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాకిస్థానీ అభిమానులు నెట్టింట్లో ఫైర్ అవుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ స్టంపౌట్ అయ్యాడు. అతను రమేశ్ మెండిస్ బౌలింగ్‌లో నిరోషన్ డిక్వెల్లా స్టంపౌట్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇమామ్-ఉల్-హక్ నిర్లక్ష్యం అతని కొంప ముంచింది. ఇంతకీ ఏం చేశాడని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం..
ఇమామ్ ఉల్ హక్ నిర్లక్ష్యం..
ఇమామ్-ఉల్-హక్ ఆఫ్ స్పిన్నర్ రమేష్ మెండిస్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వికెట్ కీపర్ డిక్వెల్లా గ్లోవ్స్‌లో తగిలింది. ఈ సమయంలో, డిక్వెల్లా స్టంప్‌లను పడగొట్టాడు. దీంతో స్టంప్ అవుట్ అప్పీల్ చేశాడు. ఇమామ్-ఉల్-హక్ పాదం క్రీజులో ఉన్నట్లు అనిపించింది. కానీ, థర్డ్ అంపైర్ రాడ్ టక్కర్ రీప్లేలలో చూడగా, పాక్ బ్యాట్స్‌మెన్ పాదం అర అంగుళం పైకి ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ తొలి వికెట్ పడింది.
ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్‌లు పాకిస్థాన్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరి మధ్య 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే, ఇమామ్ పొరపాటు శ్రీలంకకు తొలి విజయాన్ని అందించింది. 73 బంతుల్లో 35 పరుగులు చేసి ఇమామ్ ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఆటగాడు కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
That. Is. Not. A. Stumping.#SLvPAK #PAKvSL #PAKvsSL #SLvsPAK
— CRICKET VIDEOS? (@Abdullah__Neaz) July 19, 2022
పాకిస్థాన్‌కు శ్రీలంక గట్టి సవాల్..
గాలే టెస్టు గురించి మాట్లాడితే, శ్రీలంక పాకిస్థాన్ ముందు 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దినేష్ చండిమాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అజేయంగా 94 పరుగులు చేశాడు. కేవలం 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అతనికి తోడు కుసాల్ మెండిస్ 76, ఒషాద ఫెర్నాండో 64 పరుగులు చేశారు. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ నవాజ్ 5 వికెట్లు పడగొట్టాడు. యాసిర్ షా మూడు వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..